హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీముద్దీన్, అతని అనుచరుల ఆగడాలపై ఇప్పటివరకూ 39కేసులు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి నల్లగొండ, భువనగిరిలో మరో 10మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ వెల్లడించింది. కత్తుల జంగయ్య, పులి నాగరాజు, గుర్రం శివరాజు, బచ్చు నాగరాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. మరోవైపు నయీం బెదిరింపులకు పాల్పడిన వ్యాపారి గంపా నాగేందర్ ఫిర్యాదుపై సిట్ విచారణ ప్రారంభించింది. నయీం, నాగేందర్ ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ నేతలతో సిట్ అధికారులు ఇవాళ ఫోన్లో మాట్లాడారు.
కాగా నయీం కేసుకు సంబంధించి అతని అనుచరుల కస్టడీ పిటిషన్‌పై రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. నయీం కేసులో సూత్రధారులైన ఫర్హానా , అఫ్సాలను మరో ఏడు రోజుల కస్టడీతో పాటు అనుచరులైన ఫహీమ్, తాజుద్దీన్‌లను పది రోజుల కస్టడీకి అనుమతించాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి రిజర్వ్ చేసింది. ఇక గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసుల అదుపులో ఉన్న భార్య హసీనాభేగం, చెల్లెలు ఖలిమాభేగం, వాచ్‌మెన్ అబ్దుల్ మతిన్‌తో పాటు అతని భార్య సలీమాకు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని కోర్టులో హాజరుపరిచారు.
నయీం వ్యవహారంలో 39కేసులు నమోదు
Published Tue, Aug 23 2016 8:28 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM
Advertisement