
సాక్షి, యాదాద్రి: గ్యాంగ్‌స్టర్ నయీమ్ బతికి ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జైల్లో ఉండేవారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. గురువారం భువనగిరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నయీమ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం కేసీఆర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
నయీమ్‌ను తమ ప్రభుత్వమే చంపించిందని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ సోహ్రాబుద్దీన్ కేసులో అమిత్‌షా పాత్ర ఉందన్న విషయం బయటపడుతుందని కేంద్రమే నయీమ్‌ను ఎన్‌కౌంటర్ చేయించిందన్నారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే సిట్ నివేదికను, నయీమ్ డైరీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment