కరీంనగర్: గ్యాంగ్స్టర్ నయీం ముఠాకు చెందిన రమేష్, గోవర్ధనచారి అలియాస్ గోపిలను కరీంనగర్ జిల్లా కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నయీం అనచరులను జగిత్యాల కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది.
నయీం అనుచరుల నుంచి 2 తుపాకులు, 5 బుల్లెట్లు, 15 నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు, 1.52 లక్షల రూపాయల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో నయీం హతమైన తర్వాత అతని కుటుంబసభ్యులు, బంధువులతో పాటు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
కరీంనగర్లో నయీం అనుచరుల అరెస్ట్
Published Wed, Aug 17 2016 4:50 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
Advertisement
Advertisement