గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ఉమ్మడి రాష్ట్ర సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడేనని బెల్లి లలిత సోదరుడు కృష్ణ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం తన సోదరి బెల్లి లలితను 1999లో అతికిరాతకంగా చంపించారని దుయ్యబట్టారు. అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి ఆదేశాల మేరకు లలితను నమూమ్ హత్య చేయించారని, ఆపై మృతదేహాన్ని అతికిరాతకంగా 17ముక్కలు చేయించాడన్నారు.