
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలతో పబ్బం గడుపుతున్న బీజేపీ అసలు పేరు భారతీయ జూఠా పార్టీ అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ఎగనామం పెట్టేందుకు బీజేపీ రోజుకో కొత్త నాటకమాడుతోందని విమర్శించారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు ఏదో చేసినట్టు అబద్ధాలు చెప్పారన్నారు. ప్రధాని మోదీని దూషించే విధంగా మాట్లాడలేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరణ ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధం లేని అంశాలతో, మతం పేరుతో రాజకీయాలు చేసే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment