
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. ఆయనిక్కడ సోమవారం మాట్లాడుతూ రాజ్‌భవన్‌ను రాజకీయాలకు అడ్డాగా మార్చింది కాంగ్రెస్సే అని వ్యాఖ్యానించారు. గవర్నర్ వాస్తవాలు మాట్లాడినా ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ నేతలకు పనిగా మారిందని విమర్శించారు.
మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్రపై కర్నె ప్రభాకర్ స్పందించారు. పవన్ ను తాము రాజకీయ నేతగా చూడటం లేదన్నారు. సినీ నటుడిగానే పవన్ కల్యాణ్.. కేసీఆర్‌ను కలిశారని స్పష్టం చేశారు. పవన్ పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment