ఉత్తమ్ మాట్లాడేవన్నీ పచ్చి అబద్ధాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదని, తెలంగాణ వస్తదో, రాదో కూడా తెలియని స్థితిలో ఉద్యోగం వదులుకుని ఉద్యమంలోకి వచ్చారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలంతా తెలంగాణ వైపు చూసేలా రెండు, మూడు లక్షల ఉద్యోగాలు వచ్చేలా కేటీఆర్ కృషి చేస్తున్నారని, ఆలాంటి వ్యక్తిని పట్టుకుని దోచుకోవడానికే అమెరికా నుంచి వచ్చారని అవాకులు, చవాకులు పేలడం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిక్కుమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు.
బుధవారం కర్నె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ఐరన్ లెగ్ అని, మంత్రి కేటీఆర్‌ది గోల్డెన్ లెగ్ అని పేర్నొన్నారు. కేటీఆర్‌కు రాహుల్‌ను విమర్శించే స్థాయి లేదని ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.