సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను ఒక్క క్షణం కూడా అసంతృప్తిగా ఉంచకూడదనేదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కేసీఆర్ నాయకత్వానికే చెల్లిందన్నారు.
గ్రామీణ అభివృద్ధికి రూ.23 వేల కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు, గృహ నిర్మాణం రంగానికి రూ.11,900 కోట్లు, ఆర్టీసీ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ, పట్టణ ప్రజలందరికి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో రైతులకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రైతుల కోసం ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment