కాంగ్రెస్ విధానాల వల్లే రైతులకు నష్టం: కర్నె | karne prabhakar fired on congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ విధానాల వల్లే రైతులకు నష్టం: కర్నె

Published Wed, Sep 21 2016 2:14 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

కాంగ్రెస్ విధానాల వల్లే రైతులకు నష్టం: కర్నె - Sakshi

కాంగ్రెస్ విధానాల వల్లే రైతులకు నష్టం: కర్నె

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని, అవినీతికి పర్యాయ పదమైన ఆ పార్టీ నేతలు ఇప్పుడు నీతులు చెబుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ద శాబ్దాలుగా కాంగ్రెస్ అవలంభించిన విధానాల వల్ల రైతులు నష్టపోయారన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసుకోవడానికి కాకుండా, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడానికి కాంగ్రెస్ శిక్షణ శిబిరాలను వేదికగా మార్చుకుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు ఆమోదిస్తే, 2013లో కిరణ్‌కుమార్ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిందని, అలాంటి ప్రాజెక్టును అక్రమ ప్రాజెక్టు అనడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement