సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు. రాజ్యాంగాధినేత అయిన గవర్నర్ ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆయన అన్నారు. గడచిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టిందని, వాటిగురించి గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు అడ్డుకోవడాన్ని సరికాదన్నారు.
కనీసం గవర్నర్ ఏం మాట్లాడుతున్నారో కూడా వినే పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ నేతలు లేరని కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. ఈ చర్య ద్వారా కాంగ్రెస్ పార్టీ తన ధోరణిని మరోసారి నిరూపించుకుందన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వారిలో వారే కొట్టుకోవడం, పేపర్లు విసురుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నారు. టీఆర్‌ఎస్ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి అని, అయితే కొంతమంది వ్యక్తులు రాజకీయ కుట్రతో రాష్ట్రాన్నిసోమాలియా, ఉగాండా దేశాలలాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యట్టారు.
Comments
Please login to add a commentAdd a comment