'రైతులను కాల్చి చంపించింది చంద్రబాబే'
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై టిఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీఏ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రాంతంలో అన్నిపార్టీల నేతలు చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం చంద్రబాబు నైజమని కర్నే విమర్శించారు. విద్యుత్ సమస్యలపై ఉద్యమించిన రైతులను కాల్చి చంపించిన ఘనత చంద్రబాబుదేనని కర్నే ప్రభాకర్ ఆరోపించారు.