
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రతో కాంగ్రెస్ అబద్ధాల్ని చెబుతూ దివాళాకోరు రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తమ పాలనలో ఏనాడూ నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో బుధవారం కర్నె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 24 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే, అందులో సింహభాగం ఆంధ్రా వారికే కట్టబెట్టారన్నారు. ఆనాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి దీనిపై అప్పుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ మూడున్నరేళ్ల కాలంలోనే 81,739 ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment