
గందరగోళానికి కాంగ్రెస్, జేఏసీ పోటీ
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్, దాని అనుబంధ టీ జేఏసీ పోటీపడుతున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. గ్రామ పర్యటనల పేరుతో టీజేఏసీ అశాంతి సృష్టిస్తోందన్నారు.
సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని కోదండరాం అవాస్తువాలు చెబుతున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నల్లగొండకు నీళ్లు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి వ్యాఖ్యా నించడంపై కర్నె అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఈ పథకం అటకెక్కినప్పుడు వంశీచంద్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.