హైదరాబాద్: ప్రముఖ రచయత, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత సి.నారాయణరెడ్డి మృతికి టీఆర్‌ఎస్‌ఎల్పీ తరపున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన మృతి సాహితీ రంగానికి తీరని లోటని అన్నారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. గత పాలకులంతా బీసీలను ఓటేసే మర యంత్రాలుగా చూశారని, ఓబీసీ కమీషణ్‌కు చట్టబద్దత తేవాలని ప్రయత్నిస్తే రాజ్యసభలో బిల్లును అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ బీసీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తోందన్నారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా 119 బీసీ గురకుల పాఠశాలలు ప్రారంభిస్తుండడం చారిత్రాత్మకం అన్నారు. కాంగ్రెస నేతలది మాత్రం ఓట్ల రాజకీయ విద్యార్థులకు నీతి పాఠాలు చెప్పాల్సిన కోదండరాం అపద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోదండరాం ఏఆధారాలతో ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ప్రశ్నించారు. కోదండరాం మాటలు కాంగ్రెస్ మాటలకు జిరాక్స్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మియాపూర్ కుంభకోణాన్ని ప్రభుత్వమే వెలుగులోకి తెచ్చిందన్నారు. ఇందులో ఎలాంటి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు.
బీసీలను ఓట్లేసే మిషన్లుగానే చూశాయి: కర్నె
Published Mon, Jun 12 2017 2:18 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM
Advertisement
Advertisement