కాంగ్రెస్, టీడీపీలవి మూర్ఖపు వాదనలు | Karne Prabhakar comments on TDP, Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలవి మూర్ఖపు వాదనలు

Published Wed, Sep 7 2016 1:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీలవి మూర్ఖపు వాదనలు - Sakshi

కాంగ్రెస్, టీడీపీలవి మూర్ఖపు వాదనలు

జిల్లాల విభజనతో ప్రజలకే సౌకర్యం: కర్నె ప్రభాకర్

 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై కాంగ్రెస్, టీడీపీలు మూర్ఖపు వాదనలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండి పడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే విపక్షాలు ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.

ప్రధాన సమస్యలను ఎత్తిచూపడంలో, ప్రజల పక్షాన నిలవడంలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ దరిద్రపు ప్రతిపక్షమని ఎద్దేవా చేశారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు తప్ప నాయకులు, పార్టీలు, ప్రాంతాలు లాభపడటానికి కాదని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement