
ఏనాడూ రైతులను పట్టించుకోలేదు
రైతులను అన్ని విధాలుగా ఆదుకోడానికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు.
కాంగ్రెస్‌పై కర్నె ప్రభాకర్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రైతులను అన్ని విధాలుగా ఆదుకోడానికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ నాయకులను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. 4 దశాబ్దాల పాలనలో ఒక్కరోజూ రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు తాజాగా రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రణాళికలు అమలైతే కాంగ్రెస్‌కు నూకలు చెల్లుతాయన్న భయంతో తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మంత్రుల బృందాన్ని సీఎం కేసీఆర్ ఢిల్లీకి పంపించి కేంద్రాన్ని రూ.2,200 కోట్ల సాయం కోరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే పాలమూరు ప్రజలు లక్షల సంఖ్యలో వలస పోయారని, నల్లగొండ ఫ్లోరైడు బాధితుల ఉసురు పోసుకున్నారని విమర్శించారు.