
కాంగ్రెస్, టీడీపీలే కారణం: కర్నె
తెలంగాణలో రైతుల సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ముందుచూపు లేకుండా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు కారణమన్నారు. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలు మానుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్గీ కారణం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కర్నె ప్రభాకర్ అన్నారు.