నలభై సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ విమర్శించారు.
హైదరాబాద్: నలభై సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల రైతులు పూర్తిస్థాయిలో నష్టోయారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిలయిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేయాల్సిన కాంగ్రెస్ నేతలు కేవలం స్వార్థపూరిత రాజకీయాలు చేశారని అన్నారు. కేవలం రెండు సంవత్సరాల పాలనలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు.
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వందల గ్రామాలు నీటమునిగినా నోరు విప్పని కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడమే లక్ష్యంగా ఆనాటి పాలకులు పనిచేశారని అన్నారు. దోచుకోవడం, దాని ద్వారా దాచుకోవడం అనేదే కాంగ్రెస్ విధానమన్నారు. వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిపై ముసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు.