కౌరవ సేనను ఎదిరించాం | trs leader karne prabakar fired on congres party | Sakshi
Sakshi News home page

కౌరవ సేనను ఎదిరించాం

Published Sun, Apr 24 2016 4:29 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

కౌరవ సేనను ఎదిరించాం

కౌరవ సేనను ఎదిరించాం

ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశామని, కౌరవ సేనను ఎదిరించి లక్ష్యాన్ని సాధించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ‘కౌరవ సేనను పాండవుల్లా ఎదుర్కొంటాం’ అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం టీఆర్ ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ  ప్రభుత్వం ప్రజలకు చేరువ కావడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు తమపై  విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement