
బీసీలను ఓటు యంత్రాలుగా మార్చిన కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల తరబడి దే శాన్ని, ఉమ్మడి ఏపీని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మార్చిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. బీసీలు అభి వృద్ధికి ఆమడదూరంలో ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రధాన కారణమన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమ వారం కర్నె మాట్లాడారు.
తెలంగాణలో 50 శాతానికిపైగా ఉన్న బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడు తోందన్నారు. రాష్ట్రంలో కులవృత్తులను నిలబెట్టడానికి ప్రభుత్వం అనేక నిర్ణయా లు తీసుకుందన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్‌కి మౌత్‌పీస్‌గా మారి పోయారన్నారు. మియాపూర్ భూముల విషయంలో ప్రభుత్వానికి అందిన సమాచారం ఆధారంగానే సీఎం విచార ణకు ఆదేశించారన్నారు.