
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీ ఆర్ ఎన్నడూ చెప్పలేదని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్ చైర్మన్లు కిషన్‌రావు, రంగారెడ్డిలతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మాటలు చూస్తుంటే అబద్ధాల కంటే ముందే వారు పుట్టారనిపిస్తోందన్నారు. నిత్యం కాంగ్రెస్ నేతలు చెప్పే అబద్ధాలే రాహుల్ గాంధీ చెప్పారన్నారు. వారి ప్రసంగాలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌కి గౌరవం ఇస్తామని, కానీ ఆ స్థాయిలో ఆయన మాట్లాడలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment