
రేవంత్ ఆంధ్రా కోవర్టు: కర్నె ప్రభాకర్
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కోవర్టుగా పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా కోవర్టుగా పనిచేస్తున్నారని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ విమర్శించారు.
తెలంగాణ భవన్‌లో వుంగళవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి విలేకరులతో వూట్లాడారు. రేవంత్‌రెడ్డి కొద్దిగా కూడా ఇంగితజ్ఞానం లేకుండా వూట్లాడుతున్నారని, రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత కూడా ఇంకా విషం కక్కు తూ, చిల్లర కబుర్లు, సొల్లు మాటలు మాట్లాడడం మానుకుంటే మంచిదని వుండిపడ్డారు.
గతంలో హరికృష్ణకు బాబు మంత్రి పదవిని ఎలా ఇచ్చాడో తెలుసుకుని వచ్చి తెలంగాణ మంత్రివర్గం గురించి మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.