కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సచివాలయంలో చీఫ్ సెక్రటరీని కలిసిన తరువాత ఏం మాట్లాడాలో తెలియక అనవసర ఆరోపణలు చేశారని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కర్నె ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు అవాస్తమన్నారు. సీఎంను కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వటం లేదని చెప్పటం చాలా హాస్యస్పదమని తెలిపారు. కాంగ్రెస్ నేత్లో సీఎం ను ఎక్కువ సార్లు కలిసింది కోమటిరెడ్డెనని స్పష్టం చేశారు. దాదాపుగా ఆయన తరుపున ఇప్పటికే 391 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చామని కర్రె తెలిపారు.