
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు టీఆర్‌ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆ పార్టీ నాయకులు కర్నె ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు ఏపీని వదిలి తెలంగాణకు వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలలు కూడా చంద్రబాబే దిక్కని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీకి అడ్డుపడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు బతుకమ్మ పండుగపై కూడా ఈసీని ఆశ్రయించినా ఆశ్చర్యపడనక్కర్లేదని వ్యంగ్యంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment