
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కండువా కప్పుకోకుండానే జేఏసీ చైర్మన్ ఆ పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కోదండరాం ముసుగు తొలగిపోయిందని, అభివృద్ధి నిరోధక కాంగ్రెస్ ఎజెండాను అమలుచేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుతో కలసి కర్నె విలేకరులతో మాట్లాడారు.
రైతు సమన్వయ సమితుల రద్దు కోసం సత్యాగ్రహం చేయాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని కోదండరామ్ సమర్ధించడం దారుణమన్నారు. కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్న ఆయన దేనికోసం సత్యాగ్రహం చేస్తున్నారో రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలని కర్నె డిమాండ్ చేశారు.