
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం గా, అవిశ్వాస తీర్మా నా నికి మద్దతుగా టీఆర్‌ఎస్ ఎంపీలు ఓటేస్తారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ఎంపీ వినోద్‌కుమార్ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు.
సీఎం కేసీఆ ర్ శక్తి ఏమిటో దేశ ప్రజలు త్వరలోనే చూడబోతున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీ కాదని, తెలంగాణ ప్రగతిని ప్రతి బింబిస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరితే కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభపెట్టినట్టుగా సంపత్‌కుమార్ మాట్లాడటం సరికాదని, ఆ ఖర్మ టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డిపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, నల్లగొండలో హత్యా రాజకీయాలకు పాల్పడిన చరిత్ర కోమటిరెడ్డిది అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment