ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ ప్రమాణ స్వీకారం | Karne Prabhakar sworn in MLC | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ ప్రమాణ స్వీకారం

Published Thu, Aug 21 2014 12:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

Karne Prabhakar sworn in MLC

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈరోజు ఉదయం కర్నె ప్రభాకర్ ఎల్బీనగర్ రింగ్రోడ్లోని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడ నుంచి ప్రమాణ స్వీకారానికి బయల్దేరారు.

కాగా  టీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్  పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నామినేటెడ్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా నియమితులయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement