నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. నల్లధనంఫై అసలు తమ వైఖరి చెప్పని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల వైఖరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పలు కుంభకోణాలకు పాల్పడి డబ్బులు దోచుకుని, దాచుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైఖరి చెప్పాలనడం ఏమిటని ప్రశ్నించారు.