నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: కర్నె
సాక్షి, హైదరాబాద్: నల్లధనానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. నల్లధనంఫై అసలు తమ వైఖరి చెప్పని కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీల వైఖరిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, పలు కుంభకోణాలకు పాల్పడి డబ్బులు దోచుకుని, దాచుకున్న పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వైఖరి చెప్పాలనడం ఏమిటని ప్రశ్నించారు.
కచ్చితంగా చెప్పాల్సిన చోట తమ వైఖరి చెబుతామని కర్నె అన్నారు. పెద్ద నోట్ల రద్దును ఇప్పటికే స్వాగతించామని, రాష్ట ఆర్థిక మంత్రి ఇప్పటికే పార్టీ వైఖరి వెల్లడించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీయే కెసీఆర్‌ను సలహాల కోసం ఢిల్లీకి ఆహ్వానించారని కర్నె చెప్పారు. కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీ.. కనీస అవగాహన లేకుండా నోటి కొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ది ద్వంద్వ నీతి అని.., రాష్ట్రానికో నీతి వారిదని అన్నారు. పెద్ద నోట్ల రద్దుని వ్యతిరేకిస్తే కేజ్రీవాల్, మమతా బెనర్జీలతో కాంగ్రెస్‌ఎందుకు కలవడంలేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ నల్ల డబ్బును వైట్‌గా మార్చుకునేందుకే ఢిల్లీ వెళుతున్నారన్న డీకే అరుణ ఆరోపణలు ఖండిస్తున్నామని అన్నారు.