
కాంగ్రెస్‌ను నిలదీయండి: కర్నె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అడ్డు తగులుతున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018 నాటికి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు.
అయితే కాంగ్రెస్‌పార్టీ నీచ బుద్ధితో వీటిని అడ్డుకోవడానికి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి కాళేశ్వరంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కీలక పదవులను వెలగబెట్టిన శశిధర్‌రెడ్డి వంటివారే తెలంగాణ రైతాంగానికి నీటిని రాకుండా అడ్డుకోవడం కుట్రపూరితమని ప్రభాకర్ విమర్శించారు. గతంలో పోలవరం, ప్రాణహిత వంటి ప్రాజెక్టులకు జరిగినట్టుగానే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నదన్నారు.