త్వరలోనే నిజాలు నిగ్గు తేలుతాయి: కర్నె | facts will comeout in nayeem case, says karne prabhakar | Sakshi
Sakshi News home page

త్వరలోనే నిజాలు నిగ్గు తేలుతాయి: కర్నె

Published Sat, Sep 17 2016 2:24 AM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీమ్ వ్యవహారంలో తొందరలోనే నిజాలు నిగ్గుతేలుతాయని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.

నల్లగొండ టూటౌన్: నయీమ్ వ్యవహారంలో తొందరలోనే నిజాలు నిగ్గుతేలుతాయని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుచేస్తే కొడకునైనా శిక్షిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ ఏలుబడిలో ఈ రాష్ట్రం ఉందన్నారు. నయీమ్ తో అంటకాగిన వారిని శిక్షించాలని తాము ప్రభుత్వాన్ని కోరామన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే... కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమ భవిష్యత్ అంధకారం అవుతుం దనే భయంతోనే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను ఎడారిగా మార్చాయని, కేసీఆర్ పక్క రాష్ట్రమైన మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ముందుకు పోతుంటే అడ్డుపడటం అర్థరహితమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement