
రైతుల సంక్షోభానికి కాంగ్రెస్సే కారణం: కర్నే
రైతుల సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు.
హైదరాబాద్ : రైతుల సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ విమర్శించారు. ఆదిలాబాద్ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముందుగా ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని కాంగ్రెస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండికూడా అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. గ్యాంగ్స్టర్ నయీం కేసులో సిట్ విచారణ కొనసాగుతుందన్నారు. అధికారపక్షం, ప్రతిపక్షంలో ఎవరి పాత్ర ఉన్నా వదిలేది లేదని కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు.