
వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలా?
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుల త్యాగాలపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శవరాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్గీ కారణం కాదా అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా పొన్నాల విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేవలం 462 మందినే తెలంగాణ అమరవీరులుగా గుర్తించినట్లు ప్రకటించడం వారిని అవమానించినట్లు కాదా? వారి కుటుంబాలను మోసం చేసినట్లు కాదా? అని పొన్నాల లక్ష్మయ్య అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.