
వరంగల్: బహిరంగసభలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా ఆయననుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘పొన్నాల సీనియర్ నేత. కాంగ్రెస్‌లో అణగారిన వర్గాలకు అవకాశం లేదు..
నాలుగున్నర దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తే చివరికి అవమానమే మిగిలింది.. నాకు బాధేసి ఫోన్‌లో మాట్లాడి.. పార్టీలోకి రమ్మన్నా.. ఇప్పడు గులాబీ జెండా కప్పుకున్నడు.. అన్ని వర్గాలను బీఆర్‌ఎస్ ఆదరించి పెద్ద పీట వేస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పొన్నాల మనసు గాయపడితే.. బీఆర్‌ఎస్ మందు వేసి నయం చేస్తుందని చెప్పుకొచ్చారు.