
బాబును మించిన నియంతలేడు: కర్నె
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును మించిన నియంత సమకాలీన రాజకీయాల్లోనే లేరని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును మించిన నియంత సమకాలీన రాజకీయాల్లోనే లేరని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ విమర్శించారు. పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ఇక్కడి తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం విషయంలో టీడీపీ వైఖరిపై చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేని తెలంగాణ టీడీపీ నేతలు తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై విమర్శలు చేయడం తగదన్నారు.