కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వేగంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూసి కాంగ్రెస్ పార్టీ కుళ్లుకుంటుందని, ఆ పార్టీ నేతల కడుపు మండిపోతుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, జీవన్‌రెడ్డిలు నోటికొచ్చినట్టు మాట్లాడి తమ మూర్ఖత్వాన్ని బయటపెట్టుకుంటున్నారన్నారు. పచ్చి అబద్ధాలు, అసత్యాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం ఎడారులుగా మారిన ప్రాజెక్టులు, నాలుగేళ్లలోనే నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు. నీటితో నిండిన ప్రాజెక్టులను చూడటానికి అన్ని వర్గాలు వెళ్తే, కాళేశ్వరంను పర్యాటక కేంద్రంగా మార్చారని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment