మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా? | why secret need to take ministry decisions ? | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా?

Published Fri, Jan 30 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా?

మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా?

ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. 
 
 ఇదివరకు బడ్జెట్ లోక్‌సభలో చర్చకు రాకముందే వెల్లడైతే ఆర్థికమంత్రి పదవి ఊడిపోయేది. ఇప్పుడు అలాంటి గోప్యతను ఊహించలేం. పన్నులూ, లోటూ గురించి ముందే జనానికి చెప్పి వారి సూచనలు తీసుకుని, తగిన విధంగా బడ్జెట్‌లో మార్పులు చేయడం నిజమైన ప్రజాస్వామ్యం అని నేటి భావన. అయితే ఇప్పటికీ అతి రహస్యంగా జరిగేవి ఏవంటే మంత్రివర్గ సమావేశాలు, శాసన నిర్ణయాలు. కోర్టు తీర్పులు బహిరంగంగా వస్తున్నా కేబినెట్ చర్చలు మా త్రం మంత్రి చెప్పేదాకా రహస్యమే. అధికార రహస్యా లు కాపాడతామని మంత్రులు ఇంకా ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారు.
 
 సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత కూడా కేబినెట్ నిర్ణయాలు రహస్యమేనా? ఈ చట్టం చేసినప్పు డు ఈ నిషేధానికి ఒక మినహాయింపు ఇచ్చారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ అంశానికి సంబం ధించి ఏ సమాచారమైనా అడగవచ్చు. రాబట్టుకోవచ్చు. నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అడగరాదని సెక్షన్ 8 (1)(ఐ)లో చేర్చారు. నిర్ణయం తీసుకున్న ఆ అంశం వ్యవహారం ముగిసిపోయిన తరువాత, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి కారణాలను బహిర్గతం చేయ వచ్చు అని ఆ మినహాయింపులో మరొక మినహాయిం పునకు చోటిచ్చారు. అంశం వ్యవహారం ముగిసిపోవడం అంటే ఏమిటి? జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లుపైన కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పూర్త యింది కనుక దానిపైన కేబినెట్ నోట్‌ను, ఇతర వివరా లను ఇవ్వాలని సమాచార హక్కు కింద ఒక న్యాయవాది కోరారు.
 
 రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పటికీ ఈ బిల్లు ఇంకా లోక్‌సభలో ఆమోదం పొందలేదు కనుక, సమా చారం ఇవ్వడానికి వీల్లేదని న్యాయ వ్యవహారాల శాఖ అప్పట్లో జవాబిచ్చింది. నిర్ణయం వ్యవహారం ముగిసి పోవడం అంటే, జాతీయ న్యాయ కమిషన్ ఏర్పడే దాకా అని అర్థం చెప్పకుంటే, అందుకోసం ఎంతకాలం పడితే అంతకాలం ఆ సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చా! ప్రభుత్వ వాదన అదే. న్యాయమూర్తుల నియామక కమి షన్ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరిం చాలి. ఇది భారీ సవరణ కనుక సగం రాష్ట్రాల శాసన సభలు కూడా ఆమోదిస్తే తప్ప బిల్లు చట్టంగా మారి కమిషన్ ఏర్పాటు వీలుకాదని కేంద్ర మంత్రివర్గం భావించింది. రాజ్యాంగం ఐదో భాగం, నాల్గో అధ్యా యంలో అధికరణాలు 124, 217, 222, 231, 124ఎ లను సవరించాలని రాజ్యాంగం 120వ సవరణ బిల్లు- 2013ను, కొత్తగా న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లు 2013ను ప్రతిపాదిస్తూ ఆగస్టు 2, 2013న వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. కొత్త ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసిన తరు వాత ఈ బిల్లులను ఆమోదించింది. అయినా బిల్లు చట్టమై కమిషన్ ఏర్పడే దాకా నిర్ణయం వ్యవహారం పూర్తికాలేదని అంతవరకు సమాచారం ఇవ్వనవసరం లేదని వాదించారు.
 
 ఇదివరకు ఇటువంటి అంశం మీదనే కేంద్ర సమా చార కమిషన్ తీర్పు ఇస్తే కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు అప్పీ లు చేసింది. 2009లో ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీ లించిన తరువాత సెక్షన్8 (1)(ఐ) కింద కేబినెట్ సమా చారానికి కొంత రక్షణ ఉందనీ, కాని అది పరిమితమైన కాలపరిధికి మాత్రమే లోబడి ఉంటుందనీ కోర్టు వివరిం చింది. మంత్రివర్గ చర్చల వివరాలు, సచివుల సల హాలు, ఇతర దస్తావేజులు, కేబినెట్ నోట్‌లు వెంటనే ఇవ్వకుండా ఈ సెక్షన్ కింద మినహాయింపు కాస్త వెసు లుబాటు కలిగిస్తుందని వివరించారు. అయితే కేబినెట్ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలయ్యే దాకా ఎంతకాలం పట్టినా సరే అంతవరకు సమాచారం కోసం నిరీక్షిం చాలని కాదు. రాజ్యసభలోనో, లోక్‌సభలోనో ప్రవేశ పెట్టిన మరుక్షణం మంత్రుల నిర్ణయానికి సంబంధిం చిన ప్రక్రియ పూర్తయి, జనం ముందుకు బిల్లు వచ్చి నట్టే. ఈ విషయంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయ డానికి ఇంకా ఏమైనా సూచనలు ఉన్నాయా అని ప్రజ లను, ప్రముఖులను కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సంప్రదింపుల పత్రాన్ని రూపొందించి అనేక రాష్ట్రాలలో చర్చా వేదికలను ఏర్పాటు చేసింది. ఇంత జరిగిన తరు వాత కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా దాచడానికి ఏముంది?
 
 ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. కనుక న్యాయవాది అడిగిన సమాచారం నెలరోజుల్లో ఉచితంగా ఇవ్వాలని ఆదేశించడం జరిగిం ది. నిజానికి కేబినెట్‌లో జరిగిన చర్చల వివరాలు ఇవ్వ డానికి ప్రతిబంధకాలు ఉండకూడదు. దేశ రక్షణ విష యాలయితే తప్ప మరొక అంశమేదీ కేబినెట్‌లో చర్చకు వచ్చిన తరువాత రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన పాలన రావాలంటే నిర్ణయాలు స్వ చ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన నిర్ణయాలు తీసుకోవాలం టే సమాచారం ప్రజలకు చేరాలి.
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
 professorsridhar@gmail.com
 - మాడభూషి శ్రీధర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement