Right information act
-
రైలు పట్టాలే యమపాశాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల 2020లో వలస కార్మికుల వెతలు వర్ణనాతీతం. చాలామంది నగరాలు, పట్టణాల నుంచి కాలినడకన సొంతూళ్లకు పయనమయ్యారు. రైలు పట్టాలపై నడక సాగించారు. రైళ్లు ఢీకొట్టడం వల్ల, అనారోగ్యంతో వలస కార్మికులు పట్టాలపైనే ప్రాణాలు విడిచారు. గత ఏడాది దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై 8,733 మంది మృతి చెందారని, వీరిలో అత్యధిక శాతం మంది వలస కార్మికులేనని రైల్వే బోర్డు ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక ఉద్యమకారుడు చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే బోర్డు తాజాగా సమాధానమిచ్చింది. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు 2020లో జనవరి నుంచి డిసెంబర్ వరకు రైలు పట్టాలపై 8,733 మంది మరణించారని, 805 మంది గాయపడ్డారని పేర్కొంది. రోడ్లతో పోలిస్తే రైల్వే మార్గాలపై ప్రయాణం తక్కువ దూరం కావడంతో వలస కార్మికులు వీటినే ఎంచుకున్నారని, పట్టాలపై కాలిన నడకన వెళ్తూ చాలామంది మార్గంమధ్యలో వివిధ కారణాలతో మృతి చెందారని అధికార వర్గాలు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో రోడ్లపై పోలీసుల నిఘా అధికంగా ఉండడంతో చాలామంది రైల్వే ట్రాకులపై నడుస్తూ సొంతూళ్లకు పయనమయ్యా రని అన్నారు. దేశవ్యాప్తంగా 70 వేల కిలోమీటర్ల మేర రైల్వే ట్రాకులు విస్తరించి ఉన్నాయి. నిత్యం 17 వేల రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తుంటాయి. 2016, 2017, 2018, 2019తో పోలిస్తే 2020లో రైలు పట్టాలపై చోటుచేసుకున్న మరణాలు తక్కువేనని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. 2016లో 14,032 మంది, 2017లో 12,838 మంది, 2018లో 14,197 మంది, 2019లో 15,204 మంది రైలు పట్టాలపై ప్రాణాలు విడిచారు. (చదవండి: భార్యను చంపి నాటకం.. ఘరానా ఎస్సై అరెస్ట్) -
ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు
ఇండోర్: దేశంలోని 10 ఐఐటీల్లో గత అయిదేళ్లలో (2014–2019) 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం సమాధానమిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. ఐఐటీ–మద్రాస్‌లో ఈ అయిదేళ్ల కాలంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించింది. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అయిదుగురు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–హైదరాబాద్‌లలో ముగ్గురేసి చొప్పున విద్యార్థులు, బోంబే, గువాహటి, రూర్కీ ఐఐటీల్లో ఇద్దరేసి చొప్పున విద్యార్థులు, వారణాసి, ధన్‌బాద్, కాన్పూర్ ఐఐటీల్లో ఒక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. కానీ, కారణాలు మాత్రం వెల్లడించలేదు. విద్యార్థుల బలవన్మరణాలను నివారించడానికి ప్రతీ ఐఐటీలో విద్యార్థుల గ్రీవియెన్స్ విభాగాలు, క్రమశిక్షణా చర్యల కమిటీలు, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. -
పిల్లి అలవెన్సు అడిగేవారే లేరా?
గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు. సర్కారీ దస్తావేజులను ఎలుకలు తినేస్తుంటాయని తెలుసా? వాటిని నిర్మూలించడానికి పిల్లిని పెంచుకోవచ్చని తెలుసా? అందుకోసం ప్రభుత్వం కొంత భత్యం కూడా ఇస్తుందని తెలుసా? కక్షగట్టిన తోటి అధికారులు అసూయతో వేధిస్తుంటే బాధిత ఆఫీసర్లను రక్షించేది ఆర్టీఐ. దస్తావేజులు మాయం చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత గొప్ప చట్టాలైనా ఎంత గొప్ప తీర్పులనైనా సరే నిర్వీర్యం చేయగలరు. ఏ నియమాలూ లేవనుకున్నా సరే మేలు చేయదలచుకుంటే చేయగలరు. అధికారులు ఉత్తములైతే దుర్మార్గపు నేతలు కూడా ఏమీ చేయలేరు. ఐఏఎస్ వారే దుర్మార్గులైతే మంచి రాజకీయ నాయకులను కూడా నాశనం చేయగలుగుతారు. 1995 నాటి కొన్ని ఫైళ్ల నంబర్లు ఇచ్చి తనపైన పెండింగ్‌లో ఉన్నాయన్న సీబీఐ కేసులేమిటి, వాటి పరిణామాలేమిటి, సంబంధిత కాగితాల నకళ్లు ఇవ్వాలని సీనియర్ అధికారి విజేంద్రసింగ్ జాఫా ఆర్టీఐ ద్వారా అడిగారు. పీఐఓలు దీంతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఎస్ జె ఈ శాఖ, గిరిజన శాఖ, విజిలెన్సు విభాగం దానిని తంతూనే ఉన్నాయి. సాంఘిక న్యాయ మంత్రిత్వ శాఖనుంచి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా రూపొందించిన తరువాత పాత ఫైళ్లు తమ వద్ద లేవన్నారు. విజేంద్ర జాఫా 20 ఏళ్ల కిందట రిటైరయ్యారు. అనారోగ్యంతో రాలేకపోతే మిత్రులు భారతేంద్ర సింగ్ బాస్వాన్ అనే మరో సీనియర్ అధికారి వచ్చారు. జాఫా అవినీతిని సహించే వారు కాదు. తన పైనున్న డైరెక్టర్ అక్రమాలపైన ప్రాథమిక పరిశోధన చేసి మరింత దర్యాప్తు జరపవలసిన తీవ్ర అంశాలని నిర్ధారణ చేసుకున్న తరువాత సమగ్రమైన ఫిర్యాదు చేశారు. దానికి ప్రతీకారంగా ఆ పెద్ద అధికారి జాఫా మీద నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేయడం వల్ల తీవ్రమైన మనోవేదనకు గురైనారు. అవి అవాస్తవాలని రుజువు కావాలన్నదే ఆయన తపన అని బాస్వాన్ వివరించారు. ఐఏఎస్ తెలివి తేటలు దుర్మార్గంగా ఉంటే దేశానికి ప్రమాదమే. అవినీతిపరులైన అధికారులను పై వారు కింది వారు సమర్థిస్తూ ఎంతో ఐకమత్యంతో తమ అక్రమాలను కాపాడుకుంటూ ఉంటారు.వారికి డబ్బుకు కొరత ఉండదు. ఇక నీతిమంతులు కలసి ఉండే అవకాశం లేదు. నానాటికీ వారి సంఖ్య తగ్గిపోతున్నది. కలసి పోరాడడానికి భయపడతారు. డబ్బు కూడా దొరకదు. చట్టం సహకరించదు. కోర్టుల్లో కొన్ని యుగాలు పడుతుంది. మంచి అధికారి ఈ దుర్మార్గుల అవినీతికి రుజువులు సంపాదించే లోగా, అవాస్తవ ఆరోపణలు విసరడంతో మంచి పనులన్నీ ఆగిపోతాయి. జీతాల్లో కోతలు, పింఛను నిర్ధారణలో ఆలస్యాలకు ఈ అబద్ధపు కేసులు వాడుకుంటారు. వారిని వేధించి అక్రమార్కులు బయటపడతారు. కాని సక్రమాధికారులమీద మచ్చలు తుడవరు. ఫిర్యాదులు ఫైళ్లలో ఉంటాయి. ఆ ఫైళ్లు దొరకనీయరు. విచారణ పూర్తి చేయరు. కనీసం ఆ ఫైళ్లను ఇవ్వరు. ఆర్టీఐ విభాగంలో పనిచేసే సీపీఐఓలు పై అధికారుల చేతిలో పావులు. పైవారు ఏది రాయమంటే అది రాస్తారు. జవాబివ్వకుండా గుట్టలకొద్దీ ఫైళ్లు నిర్మిస్తారు. రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు ఏ సమాచారమూ లేకుండా ఒక క్లర్కును పంపిస్తారు. ఆ ఫైళ్లు లేవు ఏంచేస్తారో చేస్కోండి అని వాదించడమే వీరు సాగించే దుర్మార్గం. జాఫా గారికి కూడా అదే జవాబు. మంత్రులకు, ప్రభుత్వాలకూ ఇవి పట్టవు. పాత దస్తావేజులు తొలగించేందుకున్న విధానాన్ని పాటించరు. ఎప్పుడు ఏ రికార్డు తొలగించారో ఒక రిజిస్టర్లో రాయాలి. రాయరు. ఆశ్చర్యమేమంటే గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు. పిల్లి భత్యం ఉంటుందని చాలామందికి తెలియదు. అయినా ఫైళ్లు తిని ఎలుకలు మేలు చేస్తుంటే పిల్లిని పెంచడమెందుకు? ఆ అలవెన్సు అడిగేదెవరు? లంచగొండుల లంచాలను, నీతిపరుల నీతిని రుజువు చేయగల సాక్ష్యాలు దస్తావేజులు. వాటినే మాయం చేయడం ఐపీసీ కింద నేరం. పబ్లిక్ రికార్డు చట్టం కింద కూడా నేరం. ఆర్టీఐలో ఫైళ్లు దొరకడం లేదు కనుక సమాచారం ఇవ్వకుండా ఉండే మినహాయింపు లేదు. బ్రిటిష్ పాలనాకాలంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేది. దేశాన్ని దోచుకున్న వివరాలు ఫైళ్లలో ఉండకపోయినా పాలనకు సంబంధించిన వివరాల దస్తావేజులు కాపాడేవారు. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొన్ని శాఖల వారు కాగితాలు, పత్రాలు రక్షించే ప్రక్రియ కొనసాగించారు. కాని రాను రాను ఒక్కొక్క శాఖ దస్తావేజులను వృథా పదార్థాలుగా భావించే బాధ్యతారాహిత్య ధోరణిని అలవరుచుకున్నాయి. అవినీతి పరులు ఇష్టారాజ్యంగా ఫైళ్లు మాయం చేయడానికి ఇందువల్ల వీలు కలిగింది. లంచగొండుల సంఖ్య పెరగడం వల్ల మంచి అధికారులకు మరణయాతన తప్పడం లేదు. కోరిన సమాచారం ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని, పోయినాయన్న దస్తావేజులు వెతడానికి తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వాలని, వెంటనే అడిగిన పత్రాలన్నీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (విజేంద్ర జాఫా వర్సెస్ సాంఘిక న్యాయ శాఖ కేసుCIC/MOS-J-E-/A- /2017/181342 లో ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
మంత్రివర్గ నిర్ణయాలలో గోప్యత ఇంకానా?
ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. ఇదివరకు బడ్జెట్ లోక్‌సభలో చర్చకు రాకముందే వెల్లడైతే ఆర్థికమంత్రి పదవి ఊడిపోయేది. ఇప్పుడు అలాంటి గోప్యతను ఊహించలేం. పన్నులూ, లోటూ గురించి ముందే జనానికి చెప్పి వారి సూచనలు తీసుకుని, తగిన విధంగా బడ్జెట్లో మార్పులు చేయడం నిజమైన ప్రజాస్వామ్యం అని నేటి భావన. అయితే ఇప్పటికీ అతి రహస్యంగా జరిగేవి ఏవంటే మంత్రివర్గ సమావేశాలు, శాసన నిర్ణయాలు. కోర్టు తీర్పులు బహిరంగంగా వస్తున్నా కేబినెట్ చర్చలు మా త్రం మంత్రి చెప్పేదాకా రహస్యమే. అధికార రహస్యా లు కాపాడతామని మంత్రులు ఇంకా ప్రతిజ్ఞలు చేస్తూనే ఉన్నారు. సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత కూడా కేబినెట్ నిర్ణయాలు రహస్యమేనా? ఈ చట్టం చేసినప్పు డు ఈ నిషేధానికి ఒక మినహాయింపు ఇచ్చారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తరువాత ఆ అంశానికి సంబం ధించి ఏ సమాచారమైనా అడగవచ్చు. రాబట్టుకోవచ్చు. నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అడగరాదని సెక్షన్ 8 (1)(ఐ)లో చేర్చారు. నిర్ణయం తీసుకున్న ఆ అంశం వ్యవహారం ముగిసిపోయిన తరువాత, మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడానికి కారణాలను బహిర్గతం చేయ వచ్చు అని ఆ మినహాయింపులో మరొక మినహాయిం పునకు చోటిచ్చారు. అంశం వ్యవహారం ముగిసిపోవడం అంటే ఏమిటి? జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లుపైన కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పూర్త యింది కనుక దానిపైన కేబినెట్ నోట్‌ను, ఇతర వివరా లను ఇవ్వాలని సమాచార హక్కు కింద ఒక న్యాయవాది కోరారు. రాజ్యసభలో ప్రవేశ పెట్టినప్పటికీ ఈ బిల్లు ఇంకా లోక్‌సభలో ఆమోదం పొందలేదు కనుక, సమా చారం ఇవ్వడానికి వీల్లేదని న్యాయ వ్యవహారాల శాఖ అప్పట్లో జవాబిచ్చింది. నిర్ణయం వ్యవహారం ముగిసి పోవడం అంటే, జాతీయ న్యాయ కమిషన్ ఏర్పడే దాకా అని అర్థం చెప్పకుంటే, అందుకోసం ఎంతకాలం పడితే అంతకాలం ఆ సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చా! ప్రభుత్వ వాదన అదే. న్యాయమూర్తుల నియామక కమి షన్ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగాన్ని కూడా సవరిం చాలి. ఇది భారీ సవరణ కనుక సగం రాష్ట్రాల శాసన సభలు కూడా ఆమోదిస్తే తప్ప బిల్లు చట్టంగా మారి కమిషన్ ఏర్పాటు వీలుకాదని కేంద్ర మంత్రివర్గం భావించింది. రాజ్యాంగం ఐదో భాగం, నాల్గో అధ్యా యంలో అధికరణాలు 124, 217, 222, 231, 124ఎ లను సవరించాలని రాజ్యాంగం 120వ సవరణ బిల్లు- 2013ను, కొత్తగా న్యాయమూర్తుల నియామక కమిషన్ బిల్లు 2013ను ప్రతిపాదిస్తూ ఆగస్టు 2, 2013న వీటిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. కొత్త ప్రభుత్వం మరికొన్ని సవరణలు చేసిన తరు వాత ఈ బిల్లులను ఆమోదించింది. అయినా బిల్లు చట్టమై కమిషన్ ఏర్పడే దాకా నిర్ణయం వ్యవహారం పూర్తికాలేదని అంతవరకు సమాచారం ఇవ్వనవసరం లేదని వాదించారు. ఇదివరకు ఇటువంటి అంశం మీదనే కేంద్ర సమా చార కమిషన్ తీర్పు ఇస్తే కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు అప్పీ లు చేసింది. 2009లో ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీ లించిన తరువాత సెక్షన్8 (1)(ఐ) కింద కేబినెట్ సమా చారానికి కొంత రక్షణ ఉందనీ, కాని అది పరిమితమైన కాలపరిధికి మాత్రమే లోబడి ఉంటుందనీ కోర్టు వివరిం చింది. మంత్రివర్గ చర్చల వివరాలు, సచివుల సల హాలు, ఇతర దస్తావేజులు, కేబినెట్ నోట్లు వెంటనే ఇవ్వకుండా ఈ సెక్షన్ కింద మినహాయింపు కాస్త వెసు లుబాటు కలిగిస్తుందని వివరించారు. అయితే కేబినెట్ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలయ్యే దాకా ఎంతకాలం పట్టినా సరే అంతవరకు సమాచారం కోసం నిరీక్షిం చాలని కాదు. రాజ్యసభలోనో, లోక్సభలోనో ప్రవేశ పెట్టిన మరుక్షణం మంత్రుల నిర్ణయానికి సంబంధిం చిన ప్రక్రియ పూర్తయి, జనం ముందుకు బిల్లు వచ్చి నట్టే. ఈ విషయంలో న్యాయ కమిషన్ ఏర్పాటు చేయ డానికి ఇంకా ఏమైనా సూచనలు ఉన్నాయా అని ప్రజ లను, ప్రముఖులను కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఒక సంప్రదింపుల పత్రాన్ని రూపొందించి అనేక రాష్ట్రాలలో చర్చా వేదికలను ఏర్పాటు చేసింది. ఇంత జరిగిన తరు వాత కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా దాచడానికి ఏముంది? ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇవ్వగలిగిన సమాచారం ఏదైనా మామూలు జనానికి కూడా అందుబాటులో ఉంచడమే ఈ సమాచార హక్కు లక్ష్యమని చట్టమే వివరిస్తున్నది. కనుక న్యాయవాది అడిగిన సమాచారం నెలరోజుల్లో ఉచితంగా ఇవ్వాలని ఆదేశించడం జరిగిం ది. నిజానికి కేబినెట్లో జరిగిన చర్చల వివరాలు ఇవ్వ డానికి ప్రతిబంధకాలు ఉండకూడదు. దేశ రక్షణ విష యాలయితే తప్ప మరొక అంశమేదీ కేబినెట్లో చర్చకు వచ్చిన తరువాత రహస్యంగా ఉండాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన పాలన రావాలంటే నిర్ణయాలు స్వ చ్ఛంగా ఉండాలి. స్వచ్ఛమైన నిర్ణయాలు తీసుకోవాలం టే సమాచారం ప్రజలకు చేరాలి. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్