ఇండోర్: దేశంలోని 10 ఐఐటీల్లో గత అయిదేళ్లలో (2014–2019) 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం సమాధానమిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. ఐఐటీ–మద్రాస్‌లో ఈ అయిదేళ్ల కాలంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించింది.
ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అయిదుగురు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–హైదరాబాద్‌లలో ముగ్గురేసి చొప్పున విద్యార్థులు, బోంబే, గువాహటి, రూర్కీ ఐఐటీల్లో ఇద్దరేసి చొప్పున విద్యార్థులు, వారణాసి, ధన్‌బాద్, కాన్పూర్ ఐఐటీల్లో ఒక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. కానీ, కారణాలు మాత్రం వెల్లడించలేదు. విద్యార్థుల బలవన్మరణాలను నివారించడానికి ప్రతీ ఐఐటీలో విద్యార్థుల గ్రీవియెన్స్ విభాగాలు, క్రమశిక్షణా చర్యల కమిటీలు, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment