MHRD
-
ప్రొఫెసర్లకు పునశ్చరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లకు ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సెప్టెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పునశ్చరణ బాధ్యతలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇటీవల జరిగిన ఉన్నత విద్య పాలక మండలి సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు స్పష్టం చేశారు. ఈ వివరాలను లింబాద్రి మంగళవారం మీడియాకు వివరించారు. అధ్యాపకుల ఆలోచనా ధోరణిని విస్తృతపర్చేందుకు.. దేశవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సు ల్లో అనేక మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అంతర్జాతీయ విద్యా ప్రమాణాల వైపు వెళ్ళాలనే ఆకాంక్ష బలపడుతోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. డిజిటల్ యూనివర్సిటీ ప్రాధ్యానత అన్ని స్థాయిలను ఆకర్షిస్తోంది. వివిధ సబ్జెక్టుల మేళవింపుతో, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విద్యా విధానం విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. స్వదేశీ యూనివర్సిటీలు వీటి పోటీని తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఉన్న అధ్యాపకుల ఆలోచనాధోరణిని మరింత విస్తృతపర్చేందుకు ప్రత్యేక ఓరియంటేషన్ చేపడుతున్నట్టు లింబాద్రి తెలిపారు. శిక్షణ ఇలా... విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రధాన విభాగాల ముఖ్య అధికారులను వర్సిటీల వీసీలతో కలిసి ఉన్నత విద్యా మండలి ఎంపిక చేస్తుంది. ఇలా అన్ని యూనివర్శిటీల నుంచి తొలి దశలో వంద మందిని ఎంపిక చేసే అవకాశం ఉంది. సీనియర్ అధ్యాపకుడు భవిష్యత్‌లో ఉన్నత విద్యలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ కారణంగా బోధనపై నవీన మెళకువలే కాకుండా, నాయకత్వ లక్షణాలు అవసరం. గ్లోబల్ లీడర్‌గా ఉన్నత విద్యను అర్థం చేసుకునే స్థాయి కల్పిస్తారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ దిశగా ప్రత్యేక ఓరియంటేషన్ మెళకువలను నిష్ణాతులు రూపొందిస్తారు. వీటిని అనుభజ్ఞులైన అధికారులు పరిశీలిస్తా రు. అర్థమయ్యేలా వివరించే అధికారులతో ప్రత్యేక బోధన తరగతులు నిర్వహిస్తారు. అధ్యాపకులతో మొదలయ్యే ఈ పునశ్చరణ తరగతులు తర్వాత దశలో వీసీల వరకూ విస్తరించాలని భావిస్తున్నారు. -
రోజు విడిచి రోజు స్కూలుకు..
సాక్షి, హైదరాబాద్: ఒక్కో స్కూలులో పదుల తరగతి గదులు.. ఒక్కో తరగతి గదిలో 50 – 60మంది పిల్లలు.. అందులోనూ ఒక్కో బెంచ్‌పై ముగ్గురు చొప్పున విద్యార్థులు.. పక్కపక్కనే ఆనుకొని కూర్చోవ డం.. ఇదీ ఇప్పటివరకు ఉన్న ‘తరగతి గది స్వరూపం’. కరోనా నేపథ్యంలో ఇది పూర్తిగా రూపుమారనుంది. ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు ప్రత్యక్ష బోధన, మరికొన్ని రోజులు ఆన్ లైన్, డిజిటల్ బోధన (వీడియో పాఠాలు వినడం) దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. స్కూల్‌కు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను సగానికి కుదించే అవకాశం ఉంది. ‘భౌతికదూరం’పై కసరత్తు: లాక్డౌన్ ఎత్తివేశాక కూడా ఏడా ది వరకు భౌతికదూరం పాటించాల్సిందేనని వైద్య నిపుణుల అంచనా. అందుకు అనుగుణంగా కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు ప్రారంభించింది. లాక్డౌన్ ఎత్తివేస్తే వేసవి సెలవుల తరువాత ప్రారంభమయ్యే పాఠశాల ల తరగతి గదుల్లో పాటించాల్సిన భౌతికదూరంపై సమగ్ర నివే దిక అందజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సీఈఆర్టీ)ని ఆదేశించింది. ఇప్పటికే ఉన్నత విద్యలో కనీసం 25% ఆన్లైన్ బోధన చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకో వాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యలోనూ చేయాల్సిన మార్పులపై ఎన్సీటీఈఆర్టీ నివేది కను రూపొందించి ఎంహెచ్ఆర్డీకి అందజేయనుంది. ఒకరోజు స్కూల్.. మరోరోజు ‘ఆన్లైన్’: మొదటి రోజు సగం మంది స్కూల్‌కు వస్తే.. రెండోరోజు ఆ విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్, డిజిటల్ పాఠాలు వింటారు. రెండోరోజు స్కూ ల్కు వచ్చిన మిగతా సగం మంది విద్యార్థులు మూడో రోజు ఆన్లైన్, డిజిటల్ పాఠాలు వింటారు. ఇక రెండో రోజు ఇంట్లో ఉండి పాఠాలు విన్న విద్యార్థులు మూడోరోజు మళ్లీ స్కూల్‌కు వస్తారు. ఇలా రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, ఆన్లైన్, డిజి టల్ బోధన చేపట్టేలా ఎన్సీఈఆర్టీ కసరత్తు చేస్తున్నట్లు తెలి సింది. తద్వారా రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య స గానికి తగ్గుతుంది. తద్వారా భౌతికదూరం నిబంధన అమలు చేయడం వీలవుతుందని భావిస్తోంది. మరోవైపు మొత్తం విద్యా ర్థులకు రోజు విడిచి రోజు స్కూళ్లో బోధన నిర్వహించే అంశం పైనా యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు స్కూల్‌కు వస్తే మరో రోజు ఇంట్లోనే ఉండి ఆన్లైన్, డిజిటల్ బోధన ద్వారా పాఠాలు వింటారు. ఈ విధానంలో భౌతికదూరం పాటించడం సమస్య కానుంది. అందుకే ఒకరోజు సగం మందికి ప్రత్యక్ష బోధన, మిగతా సగం మందికి ఆన్లైన్, డిజిటల్ బోధనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. టీచర్లను సిద్ధంచేసే దిశగా రాష్ట్రం అడుగులు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆన్లైన్, డిజిటల్ బోధన ప్రధాన సవాల్‌గా మారనుందని విద్యానిపుణుల అంచనా. అందుక నుగుణంగా ప్రభుత్వ టీచర్లను సిద్ధం చేయాలని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ అడుగులు వేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణమండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ బోధనలో టూల్స్ వినియోగంపై టీచర్లకు శిక్షణ ప్రారంభించింది. తద్వారా టీచర్లు ఆన్లైన్ బోధన చేపట్టేందుకు కూడా సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులాలు మినహా ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు 27,432 ఉన్నాయి. వీటిలో 23,36,070 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 1.24 లక్షల మంది టీచర్లు బోధన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. ఎన్సీఈఆర్టీ రూపొందిస్తున్న విధానం ప్రకారం రాష్ట్రంలో 11.68 లక్షల మంది వరకు రోజూ స్కూల్‌కు హాజరవుతారు. తద్వారా భౌతికదూరం పాటించడం కొంత సులభం కానుంది. రోజు విడిచి రోజు, ఆన్లైన్ – డిజిటల్ బోధనకు సంబంధించి ఎన్సీఈఆర్టీ రూపొందిస్తున్న సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం ప్రకటించనుంది. -
ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీ ఖరారు అయింది. ఆగస్ట్ 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జెఈఈ (మెయిన్) పరీక్ష జూలై 18 నుంచి 23 వరకు జరుగుతుందని, మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి నీట్ పరీక్ష జూలై 26 న జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. కాగా ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన పది లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను జూన్‌లో నిర్వహించే అంశంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) దృష్టి సారించింది. పరీక్షలను వాయిదా వేసిన ఎంహెచ్ఆర్డీ తాజా షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మే 3 వరకు లాక్డౌన్ ఉన్నందున, తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణ యం ప్రకటిస్తామని ఆయా సంస్థలు ముందుగా ప్రకటించాయి. మే నెలాఖరు నాటికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందని ఎంహెచ్ఆర్డీ భావిస్తోంది. జూన్‌లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండింటిపైనా కసరత్తు... దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థలైన జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా ఏడాదిలో ప్రవేశాల కోసం గత జనవరిలో మెుదటి విడత జేఈఈ మెయిన్‌ను నిర్వహించింది. ఏప్రిల్ 5 నుంచి 11 వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కేంద్రం ఆదేశాల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వాయిదా వేసింది. మే 17న నిర్వహించాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను కూడా వాయిదా వేస్తూ ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పరీక్షల నిర్వహణపై కసరత్తు ప్రారంభించింది. జేఈఈ మెయిన్ నిర్వహిస్తేగానీ అడ్వాన్స్డ్ నిర్వహించే పరిస్థితి లేదు. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని ఎంపిక చేసి అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే జేఈఈ మెయిన్‌ను జూన్ మెుదట్లోనే నిర్వహించి 10 –15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలన్న ఆలోచనల్లో ఉంది. తద్వారా అడ్వాన్స్డ్ పరీక్షను జూన్ నెలాఖరుకు నిర్వహించినా జూలైలో ఫలితాలను ఇచ్చి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం జూన్ 8కల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, 17వ తేదీ నుంచి ఎన్ఐటీ, ఐఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ – జోసా) ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై మెుదటి వారంకల్లా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించి, రెండో వారంలో జోసా ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఒకవేళ కరోనా కనుక త్వరితంగా అదుపులోకి వస్తే జేఈఈ మెయిన్‌ను మాత్రం మే నెలాఖరులో నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. -
ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు
ఇండోర్: దేశంలోని 10 ఐఐటీల్లో గత అయిదేళ్లలో (2014–2019) 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు మానవ వనరుల శాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం సమాధానమిచ్చింది. విద్యార్థుల ఆత్మహత్యల్లో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. ఐఐటీ–మద్రాస్‌లో ఈ అయిదేళ్ల కాలంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించింది. ఐఐటీ–ఖరగ్‌పూర్‌లో అయిదుగురు, ఐఐటీ–ఢిల్లీ, ఐఐటీ–హైదరాబాద్‌లలో ముగ్గురేసి చొప్పున విద్యార్థులు, బోంబే, గువాహటి, రూర్కీ ఐఐటీల్లో ఇద్దరేసి చొప్పున విద్యార్థులు, వారణాసి, ధన్‌బాద్, కాన్పూర్ ఐఐటీల్లో ఒక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. కానీ, కారణాలు మాత్రం వెల్లడించలేదు. విద్యార్థుల బలవన్మరణాలను నివారించడానికి ప్రతీ ఐఐటీలో విద్యార్థుల గ్రీవియెన్స్ విభాగాలు, క్రమశిక్షణా చర్యల కమిటీలు, కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. -
‘విద్యా సంస్కరణల’ పేరుతో టోకరా
సాక్షి, సిటీబ్యూరో: యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్, లండన్ యూనివర్సిటీ సహకారంతో పాఠశాల విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం చేయడమేగాక దానికి సంబంధించిన ప్రత్యేక పథకంలో చేరితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని విజన్ డాక్యుమెంట్‌తో ఎర వేశారు. వారి మాయలో పడిన రెండు ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాల నుంచి రూ.6.8 లక్షలు కాజేశారు. ఎట్టకేలకు మోసపోయామని గుర్తించిన బాధితుల ఫిర్యాదుతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో ముమ్మరంగా గాలిస్తోంది. ఈ గ్యాంగ్ ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆసిఫ్‌నగర్‌లోని రేడియన్స్ స్కూల్, టోలిచౌక్‌లోని ఐడియల్ స్కూళ్లకు చెందిన కరస్పాండెంట్లు సోహైల్, నవీద్‌లకు ఎంహెచ్ఆర్డీ పేరుతో సైబర్ నేరగాళ్లు వాట్సాప్, ఈ–మెయిల్స్ సందేశాలు పంపారు. వీటిలో సెంటర్ ఫర్ కరెక్టివ్ రిఫామ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (సీసీఆర్‌ఈ) స్కీమ్‌లో చేరితో పాఠశాలకు కలిగే ప్రయోజనాలు, తద్వారా యజమాన్యానికి, ఉపాధ్యాయులు విద్యార్థులకు, సమాజానికి ఒనగూరే లాభాలు వివరిస్తూ ఓ విజన్ డాక్యుమెంట్‌ను ఎటాచ్ చేశారు. ప్రాథమికంగా ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టులో దేశంలోని 3000 స్కూళ్లలో చేపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. దీనికి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్ళ కాలవ్యవధి ఉందని, పనితీరును బట్టి కొనసాగింపు ఉంటుందని తెలిపారు. అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఇందులోనే సైబర్ నేరగాళ్ళు ఓ మెలికపెట్టారు. పైలెట్ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని షరతు విధించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుందని, డిపాజిట్ చెల్లించి సభ్యులుగా చేరిన వారు మాత్రమే అందుకు హాజరయ్యేందుకు అర్హులంటూ నమ్మించారు. దీంతో ఈ రెండు స్కూళ్ల కరస్పాండెంట్లు రూ. 3.42 లక్షల చొప్పున మొత్తం రూ. 6.84 లక్షలు సైబర్ నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలో మార్చి రెండో వారంలో డిపాజిట్ చేశారు. ఆపై వారు తాము డిపాజిట్ చేసిన డబ్బుకు గ్యారంటీ ఏమిటంటూ సైబర్ నేరగాళ్లను వాట్సాప్ ద్వారా అడిగారు. అప్పటితో వారి నుంచి సమాచారం ఆగిపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా సంప్రదింపులు జరగలేదు. ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా ఆ ప్రాజెక్టే లేదని తేలింది. తాము మోసపోయినట్లు గుర్తించిన వారు నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఈ ముఠాకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్యాంగ్ సభ్యులు సీసీఆర్‌ఈ పేరుతో ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సేకరించారు. వీరిని పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసుల ఆ కార్యాలయాన్ని గుర్తించి ఆరా తీయగా కొన్నాళ్ల క్రితమే మూతపడినట్లు వెల్లడైంది. సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు ఆ ఢిల్లీ గ్యాంగ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతాలను గుర్తించారు. వాటిలో రూ. 50 లక్షలకు పైగా నగదు నిల్వ ఉన్నట్లు తేల్చారు. దీంతో ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయాల్సిందిగా బ్యాంకులకు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ఈ తరహాలో మోసాలకు పాల్పడిన ఈ ఘరానా గ్యాంగ్ కోసం ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలిస్తోంది. -
ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచా లని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ)ల చైర్మన్లతోపాటు అన్ని రాష్ట్రాల సీఎస్ లకు ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ స్మితా శ్రీవాత్సవ లేఖలు రాశారు. కేంద్రం రిజర్వేషన్లు పెంచిన నేపథ్యంలో దేశంలోని సెంట్రల్ వర్సిటీలు, ఎన్ఐటీ, ఐఐటీల వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు, రాష్ట్ర విద్యా సంస్థల్లో సీట్లను పెంచాలని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సీట్లు, రిజర్వేషన్లకు ఇబ్బందులు తలెత్తకుండా సీట్ల పెంపునకు చర్యలు చేపట్టాలని, మార్చి 31లోగా దీన్ని పూర్తి చేయాలన్నారు. వీటికి సీట్ల పెంపు వర్తించదు..: ఈ సీట్ల పెంపు ఉత్తర్వులు 8 జాతీయస్థాయి సంస్థలైన హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్, దాని పరిధిలోని 10 యూనిట్లు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్స్, నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌లకు వర్తించబోవని ఎంహెచ్ఆర్డీ స్పష్టం చేసింది. -
కొత్త ఆవిష్కరణలకు ‘అటల్ ర్యాంకింగ్’
సాక్షి, అమరావతి: దేశంలోని ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఇన్నోవేషన్ సెల్’ను ఏర్పాటు చేయడంతో పాటు నూతన ఆవిష్కరణలు చేసే ఆయా సంస్థలకు ‘అటల్ ర్యాంకింగ్’విధానానికి శ్రీకారం చుట్టింది. యువతలో నూతన ఆలోచనలు, వారి ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ఈ ర్యాంకింగ్ విధానం చేపట్టింది. భవిష్యత్ అంతా నూతన ఆవిష్కరణలపైనే ఆధారపడి ఉందని, దేశం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఉన్నత విద్యాసంస్థల్లో వినూత్న ఆవిష్కరణలు మరింతగా సాగాలని కేంద్రం దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఆవిష్కరణలకు అటల్ ర్యాంకింగ్ వినూత్న ఆవిష్కరణల కోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అటువంటి ఆవిష్కరణలను చేపట్టే సంస్థలకు అటల్ ర్యాంకింగ్‌లను ఇచ్చేందుకు ‘అటల్ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్సు’(ఏఆర్ఐఐఏ)ను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కోసం దీన్ని నెలకొల్పింది. నూతన ఆవిష్కరణలు కేవలం సాంకేతిక విద్యాసంస్థల్లోనే కాకుండా అన్ని విద్యాసంస్థల్లోనూ సాగేందుకు ఈ అటల్ర్యాంకింగ్లో చోటు కల్పిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకమై, సంస్కృతులను తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న నెట్వర్క్ ఆఫ్ ఇన్నోవేషన్ క్లబ్‌ల విధివిధానాలను కేంద్రం త్వరలోనే ప్రకటించనుంది. విద్యార్థులు, అధ్యాపకులు ఈ క్లబ్లో భాగస్వాములై కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే వివిధ ఆవిష్కరణల పోటీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతినెల జరిగే ఈ పోటీల్లోని విజేతలకు బహుమతులతో పాటు ధ్రువపత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ఈ అటల్ ర్యాంకింగ్‌లకు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికిగాను అక్టోబర్ 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను కేంద్రం అందుబాటులో ఉంచనుంది. నవంబర్ 30 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ర్యాంకింగ్ జాబితాను 2019 ఏప్రిల్‌లో ప్రకటిస్తుంది. ర్యాంకింగ్‌లో 5 అంశాలకు ప్రాధాన్యం - అటల్ ర్యాంకింగ్‌లో అయిదు అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్నది ఎంహెచ్ఆర్డీ భావన. ఈ అంశాల ఆధారంగా కేంద్రం ఆయా సంస్థలకు వెయిటేజీ ఇచ్చి అనంతరం ర్యాంకింగ్ ప్రకటిస్తుంది. - నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆయా సంస్థలకు బడ్జెట్ ఖర్చులను సమకూర్చడం. దీనికి 20 పాయింట్లు వెయిటేజీ ఇస్తారు. - ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సదుపాయాలు కల్పిస్తూ సహకారం అందించడం, అందుకు వీలుగా అడ్వాన్సు సెంటర్లు ఏర్పాటు చేయడం. దీనికి 10 పాయింట్లు వెయిటేజీ. - ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వినూత్న ఆలోచనలు అందించడం. దీనికి 54 పాయింట్ల వెయిటేజీ. - బోధనాభ్యసనాల ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధిపర్చడం. దీనికి 10 పాయింట్ల వెయిటేజీ. - తమ విద్యాసంస్థల పాలనా వ్యవహరాలకు అనువుగా అత్యుత్తమ వినూత్న ఆవిష్కరణలను అభివృద్ధిపర్చడం. దీనికి 6 పాయింట్లు ఉంటాయి. -
బాలికలకు 14 శాతం సీట్లు!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ బాలికలకు 14% సీట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్ ఆర్డీ) నిర్ణయించింది. 20 శాతం కంటే తక్కువ మంది బాలికలు ఉన్న ఎన్ఐటీల్లో ఈ సీట్లు సృష్టించి భర్తీ చేయా లని పేర్కొంది. బాలుర కోటాకు భంగం వాటిల్లకుండా బాలికల కోసం సూపర్ న్యూమరరీ కింద సీట్లు సృష్టించి భర్తీ చేయాలని సూచించింది. బాలికల నమోదును పెంచేందుకు ఐఐటీల్లో చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎన్ఐటీల్లోనూ సీట్లు పెంచేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని ఎన్ఐటీలకు లేఖలు రాసినట్లు తెలిసింది. 2018–19 విద్యాసంవత్సరంలో 14 శాతం, 2019–20లో 17 శాతం, 2020–21లో 20 శాతం సీట్లు కేటాయించాలని, బాలికల నమోదును 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఐఐటీలతోపాటు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరగనున్నాయి. తగ్గిన నమోదు శాతం 2016–17 విద్యా సంవత్సరం వరకు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ స్కోర్‌తోపాటు ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేసే వారు. దీంతో 2016లో ఎన్ఐటీల్లో 20 శాతం బాలికలు చేరారు. 2017–18 నుంచి ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీని తొలగించి కేవలం జేఈఈ స్కోర్ ఆధారంగానే సీట్లను కేటాయిస్తున్నారు. దీంతో 2017–18లో చాలా ఎన్ఐటీల్లో బాలికల నమోదు 15 శాతానికి పడిపోయింది. దీంతో ఎన్ఐటీల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి బాలికల నమోదును పెంచాలని కేంద్రం నిర్ణయించింది. బాలికల నమోదు 20 శాతం కంటే తక్కువ ఉన్న ఎన్ఐటీల్లో సీట్లను పెంచనుంది. -
కేంద్ర ఉపకార వేతనాలకు ఆధార్‌తో లింక్
న్యూఢిల్లీ: కళాశాల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలను పొందేందుకు ఆధార్ కార్డును సమర్పించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్చార్డీ) చెప్పింది. ఆధార్ లేని విద్యార్థులు జూన్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకుని, ఎన్ రోల్మెంట్ స్లిప్‌ను అయినా చూపించవచ్చని ఎంహెచ్చార్డీ తెలిపింది. జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపునిచ్చింది. ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్’కింద ఉపకార వేతనాన్ని అందుకునే విద్యార్థులకు కూడా పై నిబంధననే వర్తింపజేసింది. -
‘మిగితా ఐఏఎస్‌లను త్వరలోనే అందిస్తాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 211 ఐఏఎస్‌లను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిల్లో ఇప్పటికే 171 పోస్టులు భర్తీ చేశామని.. వారు విధులు కూడా నిర్వర్తిస్తున్నారని తెలిపింది. త్వరలోనే మిగితా ఖాళీలను పూరిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోని ఐఐటీల్లో ఉన్న విద్యార్థులు, వాటి పనితీరు, అధ్యాపక వ్యవస్థ ఉన్న విధానంపై విజయసాయిరెడ్డి మరో ప్రశ్న అడిగారు. ఇందుకు లిఖిత పూర్వకంగా కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రి సమాధానం ఇస్తూ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రస్తుతం 82,604మంది విద్యార్థులు ఉన్నారని ఆగస్టు 23న ఐఐటీ కౌన్సిల్ నిర్వహించిన 50వ సమావేశంలో ఆ సంఖ్యను ఒక లక్ష వరకు పెంచాలని నిర్ణయించారని, ఇది 2020నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బహిరంగ ప్రకటనల ద్వారా, పత్రికల్లో ప్రకటించడం ద్వారా సమర్థులైన అధ్యాపక బృందాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. కొన్ని శాశ్వత ప్రాతిపదికన, మరికొన్ని కాంట్రాక్టు పద్థతిలో ఇంకొన్ని గెస్ట్ప్యాకల్టీలుగా రప్పించి విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
ఐఐటీ అభ్యర్థుల కోసం 3 చానళ్లు
న్యూఢిల్లీ: ఐఐటీ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా మానవ వనరుల అభివృద్ధి శాఖ మూడు కొత్త టీవీ చానళ్లను ప్రారంభిస్తోంది. వీటిని భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాల బోధనలకు ఉపయోగిస్తారు. వీటిలో ప్రసారమయ్యే సిలబస్‌ను ఢిల్లీ ఐఐటీ నిపుణులు రూపొందించారు. ప్రస్తుతం సిలబస్ ఆంగ్లంలో అందుబాటులో ఉండగా, హిందీ, ఇతర ప్రాంతీయ భాషల్లోకి త్వరలో అనువదిస్తారు. -
నిజనిర్ధారణ కమిటీ వేయాలి
రోహిత్ మృతిపై విద్యార్థి జేఏసీ, ఫ్యాకల్టీ సభ్యుల డిమాండ్ ఇన్చార్జి వీసీతో చర్చలు నాలుగో రోజుకు చేరిన టీచర్స్ ఫోరం దీక్షలు హైదరాబాద్: రోహిత్ ఘటనపై హెచ్‌సీయూ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పెరియస్వామి ఆదివారం విద్యార్థి జేఏసీ సభ్యులు, అధ్యాపకులతో చర్చలు జరిపారు. వర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రోహిత్ స్మారకార్థం వర్సిటీలో ఏటా ఉపన్యాస కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని జేఏసీ సభ్యులు ప్రతిపాదించారు. రోహిత్ ఘటనపై నిజనిర్ధారణకు వర్సిటీ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. క్రమశిక్షణ సంఘాన్ని మార్చి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని, పరిపాలన విభాగ పదవులకు రాజీనామా చేసిన ఎస్సీ, ఎస్టీ ఫ్యాకల్టీలను తిరిగి విధుల్లో తీసుకోవాలని, వారి రాజీనామా పత్రాలను తిరస్కరించాలన్నారు. అలాగే వర్సి టీ స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లేలా వ్యవహరించిన వీసీ అప్పారావుపై కేంద్ర మానవ వనరుల శాఖ(ఎంహెచ్ఆర్డీ)కి లేఖ పంపాలని డిమాండ్ చేశారు. తరగతులకు నష్టం కలగని విధంగా సెమిస్టర్ కాల వ్యవధిని పొడిగించాలన్నారు. ఫ్యాకల్టీ, జేఏసీ నాయకుల ప్రతిపాదనలను చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి వీసీ పెరియస్వామి తెలిపారు. అప్పారావును తొలగించాల్సిందే.. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో వర్సిటీలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. అధ్యాపకులు తిరుమల్, అనుపమ, కేవై రత్నం, లీమావాలీ దీక్షలు కొనసాగిస్తున్నారు. వీసీ అప్పారావును శాశ్వతంగా తొలగించాలని, సెలవులో ఉన్న ఇన్చార్జి వీసీ శ్రీవాత్సవను తిరిగి విధుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకునేదాకా దీక్ష కొనసాగుతుందని తెలిపారు.