న్యూఢిల్లీ: కళాశాల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలను పొందేందుకు ఆధార్ కార్డును సమర్పించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్చార్డీ) చెప్పింది.
ఆధార్ లేని విద్యార్థులు జూన్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకుని, ఎన్ రోల్‌మెంట్ స్లిప్‌ను అయినా చూపించవచ్చని ఎంహెచ్చార్డీ తెలిపింది. జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర విద్యార్థులకు మినహాయింపునిచ్చింది. ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్’కింద ఉపకార వేతనాన్ని అందుకునే విద్యార్థులకు కూడా పై నిబంధననే వర్తింపజేసింది.