హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ శనివారం మధ్యాహ్నం సమావేశమైంది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాల గురించి మంత్రులు ప్రస్తావించారు. వ్యవసాయ శాఖ విభాగంలో నియామకాలు చేపడతామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేశారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అగ్రి ఎక్స్టెన్షన్కు సంబంధించి 1000, అగ్రోనామిస్ట్లు 438 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.