మార్చి 28నే బడ్జెట్‌ సమావేశాల ముగింపు | c | Sakshi
Sakshi News home page

మార్చి 28నే బడ్జెట్‌ సమావేశాల ముగింపు

Published Fri, Feb 23 2018 2:24 AM | Last Updated on Fri, Feb 23 2018 7:34 AM

March 28th End of Budget Sessions - Sakshi

సాక్షి, అమరావతి: మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్‌ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్‌ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అదే రోజు అప్రాప్రియేషన్‌ బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తారు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త బడ్జెట్‌ నుంచి నిధుల వ్యయానికి మార్గం సుగమం అవుతుంది.

మార్చి 5న ఉదయం 9.30 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈ మేరకు సమాచార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ , ఆ చర్చకు సీఎం సమాధానమిస్తారు. మార్చి 8న ఆర్థిక మంత్రి యనమల  బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement