
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం గురువారమే అధికారికంగా ప్రకటించింది. 22న ఉదయం 11.30లకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభకు ప్రతిపాదిస్తారు.
బడ్జెట్‌పై 24న శాసనసభ చర్చిస్తుంది. 25న ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నాయి. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఇదివరకే సీఎం కేసీఆర్ సూచించారు.