counsil
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 22 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వం గురువారమే అధికారికంగా ప్రకటించింది. 22న ఉదయం 11.30లకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభకు ప్రతిపాదిస్తారు. బడ్జెట్‌పై 24న శాసనసభ చర్చిస్తుంది. 25న ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నాయి. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలకు అవసరమైన నిధులు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఇదివరకే సీఎం కేసీఆర్ సూచించారు. -
‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్
పటమట(విజయవాడ తూర్పు): డ్వాక్వా రుణ మాఫీ, ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకం తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పాలకపక్ష అనూకూల నిర్ణయాలు తీర్మానించుకునేందుకు, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా ఇది మారింది. సోమవారం నగర మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలను ప్రస్తావిస్తుంటే యథాలాపంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కౌన్సిల్ తీర్మానం తిరస్కరించి ప్రభుత్వానికి పంపినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక జీవోలు తీసుకువచ్చి స్థానిక సంస్థలకున్న స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మీ లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు అసంతృప్తిగా సమాధానాలు ఇస్తున్నారని, అధికారులు కౌన్సిల్‌ను ఖాతరు చేయడం లేదని ప్రస్తావించడంతో సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ షేక్ బీజాన్బీ మైనార్టీ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి తన వార్డుకు నిధులు రాని పక్షంలో కార్పొరేషనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. 177 అంశాలు కౌన్సిల్ ఎజండాకు రాగా అందులో 61 అంశాలను ఆమోదించారు. 22 అంశాలు ఆఫీస్ రిమార్కుకు కోరగా, 24 అంశాలు ఆఫీస్ వారు తగు చర్యలు తీసుకునేలా తీర్మానం చేశారు. మిగిలిన అంశాలను స్థానిక అభ్యంతరాలతో వాయిదా వేశారు. రుణమాఫీపై రగడ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ నగరంలో పీఎంఈవై అమలు తీరుపై గందరగోళ వాతావరణం నెలకొందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నగరంలో 12 వేలకు పైగా డ్వాక్వా గ్రూపులు ఉన్నాయని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల స్వయం సహాయక గ్రూపులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. దీనిపై టీడీపీ నాయకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చోడిశెట్టి సుజాత, అవుతు శ్రీశైలజ, బీజాన్బీ, వామపక్ష సభ్యురాలు ఆదిలక్ష్మీ మాట్లాడుతూ నగరంలో రుణమాఫీ జరగడం లేదని చెప్పారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన పాలకపక్షం చకచకా పలు తీర్మానాలు ఆమోదించుకుంది. వీధులకు, భవనాలకు పేర్లు పెట్టే అంశాలపై వైఎస్సార్సీపీ సభ్యులు అధికారపక్షాన్ని నిలదీశారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ని«ధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనానికి స్థానికులు బూదాల ఆదాం పేరు ప్రస్తావించడంపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం లేకుండా భవనానికి పేరెలా పెట్టారని పుణ్యశీల నిలదీశారు. కౌన్సిల్ తీర్మానాలు.. ♦ అడ్‌హక్ కమిటీ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదించింది. ♦ 47వ డివిజన్లో నిర్మించిన అంతిమయాత్ర భవనం నిర్వహణ వీఎంసీనే చూస్తుందని కౌన్సిల్ తీర్మానించింది. ♦ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నూతన దోభీఘాట్లు, మరమ్మతులకు గురైన దోభీఘాట్లపై వచ్చిన ప్రతిపాదనపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది. భాగ్య నగర్ గ్యాస్ ఏజెన్సీపై.. నగరంలో ఇంటింటికీ పైప్లైన్ల ద్వారా గ్యాస్ అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చ జరిగింది. చాలా ప్రాంతాల్లో సంబంధిత సంస్థ సిబ్బంది రోడ్లను తవ్వేస్తున్నారని, తవ్విన తర్వాత వాటిని పూడ్చకపోవడంతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఓవైపు ఎల్అండ్టీ, మరోవైపు ఇంజినీరింగ్, ఇంకోవైపు గ్యాస్ ఏజెన్సీ ఇలా నగరంలోని రోడ్లను తవ్వుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించారు. ఈ ఏజెన్సీకి ఇప్పుడు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్ల నిమిత్తం భూములను కేటాయించాలని ప్రతిపాదన రావడంతో సభ్యులు అభ్యంతరం తెలిపారు. భూముల కేటాయింపు ప్రతిపాదనపై కౌన్సిల్ ఆఫీస్ రిమార్కుకు పంపింది. ఎమ్మెల్యేలపై వ్యతిరేక గళం నగరంలోని ఎమ్మెల్యేలు కార్పొరేషన్‌కు ఒనగూరే నిధులపై కూడా కన్నేయడంపై కౌన్సిల్ సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరో డివిజన్లో రూ. 68.65 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్డుపై కౌన్సిల్‌ల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కార్పొరేటర్లు ఈ ప్రతిపాదనను ఆమోదించినప్పటికీ స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఎమ్యెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఇప్పటి వరకు వీఎంసీకి అలవాటులేదని, ఈ నూతన సంప్రదాయాన్ని భవిష్యత్‌లో కొనసాగించకూడదని సభ్యులు కోరారు. కార్పొరేషన్లో బీపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎమ్యెల్యేలకు రెండు కోట్ల చొప్పున కే టాయించామని, ఆ పరిధి దాటితే తప్పనిసరిగా మేయర్ సమక్షంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనాలతో సహా పనుల వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. చెన్నుపాటి గాంధీ వర్సెస్కమిషనర్ నివాస్ నగరంలోని వరద నీటి ముంపును నిరోధించేందుకు ఎల్అండ్టీ చేపట్టిన స్ట్రామ్‌వాటర్ పనులు నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఎల్ఐసీ కాలనీలో జరుగుతున్న ఈ పనులు నిలుపుదల చేయాలని కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించగా దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో కార్పోరేటర్ గాంధీకి, కమిషనర్ జె. నివాస్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ సందర్భంలో కమిషనర్ ఎల్అండ్టీ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గాంధీ ఆరోపించినప్పటికీ కమిషనర్ సుతిమెత్తగా వివరించారు. -
అనర్హులకు పింఛన్లు ఇస్తారా?
మేయర్‌ను నిలదీసిన ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్లు పూర్తిస్థాయి విచారణ చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల ఆదేశం రూరల్ డివిజన్లకు సిటీ పింఛన్లు ఎలా ఇస్తారన్న నండూరి రమణ సాక్షి, రాజమహేంద్రవరం : అనర్హులకు పింఛన్లు కేటాయిస్తున్నారని, ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్ల డివిజన్లలో జన్మభూమి కమిటీలకు పింఛన్లు కేటాయించారన్న అంశంపై రాజమహేంద్రవరం నగరపాలక మండలి సమావేశంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ ఎం.షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు పి.నిర్మల, ఇ.బాపన సుధారాణిలతో పాటు స్వతంత్ర కార్పొరేటర్లు మేయర్‌ను నిలదీశారు. బుధవారం ఉదయం10.30 గంటలకు కౌన్సిల్ సమావేశం మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన ప్రారంభమైంది. అంతకు ముందు పింఛన్ల కేటాయింపుల్లో తమ వార్డులకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ ఉదయం 10 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, ప్రతిపక్ష కార్పొరేటర్లు పింఛ¯ŒS దరఖాస్తుదారులతో ధర్నా చేశారు. మేయర్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. మూడో పట్టణ సీఐ రామకోటేశ్వరరావు తన సిబ్బందితో రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధర్, విప్ మింది నాగేంద్ర, కార్పొరేటర్ బొంతా శ్రీహరి తదితరులను అరెస్ట్ చేసి స్టేష¯న్కు తరలించారు. కాగా, 11 గంటల సమయంలో కౌన్సిల్ సమావేశానికి వైఎస్సార్ సీపీ మహిళా కార్పొరేటర్లు హాజరయ్యారు. పింఛన్ల కేటాయింపుల్లో వివక్ష, తమ పార్టీ కార్పొరేటర్లను అరెస్ట్ చేయడంపై ఎం.షర్మిళారెడ్డి, పి.నిర్మల, ఇ.బాపన సుధారాణి కౌన్సిల్‌ను స్తంభింపజేసి తమ పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. వారిని బయటకు పంపేయాలని టీడీపీ కార్పొరేటర్లు మేయర్‌ను డిమాండ్ చేయడంతో కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో మార్షల్స్(మహిళా సిబ్బంది) వారిని బయటకు తీసుకెళ్లారు. స్వతంత్ర కార్పొరేటర్లు, బీఎస్పీ కార్పొరేటర్ బర్రే అనుహెలెనియా కూడా ఇదే విషయంపై మేయర్ పోడియం ముందు మౌనదీక్షకు దిగి నిరసన వ్యక్తం చేయడంతో గోరంట్ల రెండున్నరేళ్లలో నగరపాలక సంస్థ పరిధిలో ఇచ్చిన 3600 పింఛన్లపై సమగ్ర విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సారి వచ్చే పింఛన్ల కేటాయింపులో పేదలు ఎక్కువగా ఉన్న డివిజన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గ పరిధి అధారంగా కేటాయించిన పింఛన్లను రూరల్ నియోజకవర్గంలోని 8 డివిజన్లకు కూడా ఎలా పంపిణీ చేస్తారని స్వతంత్ర కార్పొరేటర్ నండూరి వెంకటరమణ ప్రశ్నించారు. గతంలోలాగే తన నియోజకవర్గంలోని 8 డివిజన్లకు ఈ సారి 340 పింఛన్లు కేటాయించారని ఎమ్మెల్యే గోరంట్ల సమాధానమిచ్చారు. దీంతో స్వతంత్ర కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా...? ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన వారిని అరెస్టు చేస్తారా? వారిలో ఉన్న కార్పొరేటర్లను విడిచిపెట్టమని చెప్పండి, వారు సభకు వస్తే నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశం ఉంటుందని షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. వారిని సభకు అనుమతిస్తే పింఛన్లపై చర్చించవచ్చని అనడంతో గోరంట్ల కల్పించుకుని హు ఆర్ యు? నా కారునే అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడ్డుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పడంతో అధికారపార్టీ కౌన్సిలర్లు తమ ఎమ్మెల్యేపైనే విమర్శలు చేస్తారా అంటూ ఎదురుదాడికి దిగారు. ఈ తరుణంలో పింఛన్లపై సమాధానం చెప్పాలంటూ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్దకు దూసుకువెళ్లి పింఛన్లపై అవకతవ కలపై సమాధానం చెప్పాలని మేయర్‌ను నిలదీశారు. చైర్లో కూర్చుంటే సరిపోదని, రూల్ చేయాలని షర్మిల హితవుపలికారు. ఇంతలో గోరంట్ల జోక్యం చేసుకుని వైఎస్ హయాంలో కేంద్రం రూ.400 ఇస్తే ఆయన మాత్రం రూ.200లు ఇచ్చారనడంతో షర్మిలారెడ్డి తీవ్రంగా స్పందిస్తూ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం పింఛన్లు మంజూరు చేశారా చెప్పండని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ కార్పొరేటర్లు వాసిరెడ్డి తదితరులు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, అంతా తమకు నచ్చినట్టే పనులు చేసుకుంటామని బిగ్గరగా అరవడం, ఇందుకు ప్రతిగా వైఎస్ఆర్సీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు వాదనకు దిగడంతో వారి మైక్‌ఇవ్వకుండా, మార్షల్స్‌తో ప్రతిపక్ష కార్పొరేటర్లను బయటకు పంపించేశారు. అంతా మాఇష్టం ... తాడితోట (రాజమహేంద్రవరం) : నగర పాలకసంస్థ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ ఇష్టారాజ్యంగా సాగింది. ప్రతిపక్ష పార్టీలకు కనీసం సమస్యలు ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యవహరించారు. పింఛన్లలో వివక్ష ప్రదర్శించారని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ షర్మిలారెడ్డి, విప్ ఈతకోటి బాపన సుధారాణి, తదితరులు పోడియం వద్దకు వెళ్లి మేయర్‌ను నిలదీయడంతో అధికార పక్ష నేతలు మార్షల్స్‌తో వారిని బయటకు తరలించారు. బీఎస్పీ కార్పొరేటర్ మౌన నిరసన స్ధానిక 49వ డివిజన్ కార్పొరేటర్ (బీఎస్పీ) బర్రే అనుహెలీనియా పింఛన్ల కేటాయింపుపై వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి నీలిరంగు వస్త్రం నోటికి చుట్టుకుని వచ్చి మేయర్ పొడియం వద్ద బైఠాయించి పింఛన్ల కేటాయింపులో తమ వార్డుకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. క్వారీ గోతుల్లో పడి పసిపిల్లలు మృతి చెందుతున్నా వాటిని పూడ్చడంలో నిర్లక్ష్యం వహించారన్నారు. ఎస్సీ కాంపోనెంట్ నిధులు ఎస్సీలు నివసించే ప్రాంతాల అభివృద్ధికే కేటాయించాలని డిమాండ్ చేశారు. మేయర్ వినియోగిస్తున్న కారు అద్దె రూ.40 వేలు కలిపి నెలకు రూ.70 వేలు వరకూ ఖర్చు అవుతోందంటూ ప్రజల సొమ్ము దుబారాపై మౌన నిరసన తెలిపారు. -
మండలిలో ఏం జరుగుతోంది?
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌పై కౌన్సిల్లో రగడ మాస్టర్‌ప్లాన్, కౌన్సిల్ అజెండా ఆమోదం ఆలస్యంపై నిలదీసిన సభ్యులు మేయర్ ప్రెస్‌మీట్ అంశాలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ నగరంలో విలీన ప్రతిపాదిత పంచాయతీలకు మాస్టర్‌ప్లాన్ రూ.16 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ పనుల ప్రతిపాదనలకు ఆమోదం సాక్షి, రాజమహేంద్రవరం: నగరపాలక మండలిలో ఏం జరుగుతోందో తమకు తెలియడంలేదని, పాలన, నూతన మాస్టర్‌ప్లాన్ ఇలా అనేక అంశాల్లో అంతా అయోమయంగా ఉందని అధికారపార్టీ కార్పొరేటర్లు, స్వతంత్ర కార్పొరేటర్లు మేయర్ పంతం రజనీ శేషసాయి, అధికారులను నిలదీశారు. తామను కార్పొరేటర్లుగా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నగర మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. నూతన మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదం ఆలస్యం, అజెండా అంశాలపై మేయర్ ప్రెస్‌మీట్, అజెండా అంశాల ఆమోదం ఆలస్యం, మోరంపూడి–స్టేడియం రోడ్డు ఇలా పలు అంశాలపై వాడీ వేడిగా చర్చ జరిగింది. అజెండాలోని అంశాలను తమ దృష్టికి తీసుకురాకుండానే మరో నాలుగు అంశాలను తమ ప్రసంగంలో చేర్చారని మేయర్‌ను నిలదీశారు. అనంతరం చర్చ ప్రారంభించగా 12వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్ మాట్లాడుతూ మేయర్ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులకు, మేయర్‌కు సత్సంబంధాలు ఉన్నాయో లేదో చెప్పాలన్నారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పిల్లి నిర్మల మాట్లాడుతూ ఇదే విషయాన్ని మేయర్ కూడా ప్రస్తావించారన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయరామరాజు కల్పించుకుని సాధారణంగా అజెండా, సప్లిమెంటరీ అజెండా, టేబుల్ అజెండా అని మూడు అంశాలుంటాయని, అత్యవసరమైన వాటిని అజెండాలో చేర్చే అధికారం చట్ట ప్రకారం తమకు ఉందంటూ పురపాలక చట్టంలోని సెక్షన్లను వివరించారు. అజెండాలో పెట్టడం వరకే తమ పని అని ఆ అంశాలను కౌన్సిల్ ఆమోదిస్తేనే అమలు చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. మోరంపూడి–స్టేడియం రోడ్దు వెడల్పు ఎంత? మోరంపూడి–స్టేడియం రోడ్డు ఎంత మేర వెడల్పుతో విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో ఉందో చెప్పాలని గొర్రెల సురేష్ ప్రశ్నించారు. 80 అడుగులకు మార్క్ చేసినట్టు పత్రికల్లో వచ్చిందని, దీనిపై ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలన్నారు. కౌన్సిల్లో మేయర్ ఆమోదించిన మేరకే రోడ్డు విస్తరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో టీడీపీ కార్పొరేటర్లు కొందరు 80 అడుగులకే విస్తరించాలని ఆమోదించారనగా, ఈ విషయం అధికారులు చెప్పాలని సురేష్ కోరారు. ఈ రోడ్డుపై వచ్చిన 50 అభ్యంతరాలను డీటీసీపీ కార్యాలయానికి పంపామని, అక్కడ నుంచి నిర్ణయం రావాల్సి ఉందని కమిషనర్ చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో ఏ అంశాలు సవరించారో వెల్లడించాలని ఎమ్మెల్యే గోరంట్ల అధికారులను కోరారు. మాస్టర్‌ప్లాన్ ఎప్పుడు పంపారు? మాస్టర్‌ప్లాన్‌లో చేసిన సవరణలు మినిట్స్‌లో రికార్డు కాలేదన్న విషయం డీటీసీపీ అధికారులు చెబుతున్నారని, ఎందుకు రికార్డు చేయలేదో అధికారులు చెప్పాలని ఎమ్మెల్యే గోరంట్ల కోరారు. అసలు మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి ఎప్పుడు పంపారో చెప్పాలని సురేష్ డిమాండ్ చశారు. దీనికి కమిషనర్ బదులిస్తూ గత నెల 24న మేయర్ సంతకం చేసి పంపగా తాము సెలవుదినం అయినా 26వ తేదీన పంపామని తెలిపారు. కౌన్సిల్, స్థాయీసంఘం సమావేశాలు నిబంధనల ప్రకారం తరచూ జరగాలని, అక్కడ ఆమోదించిన అంశాలపై వెంటనే సంతకం చేయాల్సిందేనని గోరంట్ల స్పష్టం చేశారు. ఎక్కడ అల్యమైందన్న విషయం అధికారులు రికార్డు చేయాలన్నారు. అనంతరం అజెండాలోని 13 అంశాలను ఆమోదించారు. వీటితోపాటు టెబుల్ అజెండాగా వచ్చిన నగరంలో విలీనానికి ప్రతిపాదించిన 9 గ్రామాలు, వేమగిరికి మాస్టర్‌ప్లాన్ తయారీ, 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.16 కోట్లతో అంచనా వేసిన 44 పనులకు, అమృత్ పథకంలో భాగంగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి నగరపాలక సంస్థ క్రెడిట్ రేటింగ్‌ను అంచనావేసే పనిని ఐసీఆర్ఏ సంస్థకు ఇచ్చే ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించింది.