రాష్ర్ట బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తును దాదాపు పూర్తి చేశారు.
హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తును దాదాపు పూర్తి చేశారు. బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
సుమారు రూ. 80 వే ల కోట్ల మేరకు బడ్జెట్ ఉంటుందని అంచనా. జూన్ 2 నుంచే బడ్జెట్ ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జూన్ నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చుతోపాటు నవంబర్ నుంచి మార్చి వరకు చేయాల్సిన వ్యయానికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందనుంది. సమావేశాలు 20 రోజులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం.