Rajinder etela
-
సీఎస్టీ బకాయిలు వెంటనే చెల్లించండి
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి ఈటల రాజేందర్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: రాష్ట్రానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన ఈటల టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్, ఢి ల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్‌తో కలసి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను వారి కార్యాలయాల్లో కలిశారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ ఆడపడుచులకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి ఓ లేఖ రాశారు. దానిలో చేసిన విజ్ఞప్తి మేరకు 20 లక్షల గ్యాస్ కనెక్షన్లను వచ్చే రెండేళ్లలో ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరాం’ అని ఈటల తెలిపారు. అదేవిధ ంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశంలో రాష్ట్రానికి కేంద్ర నుంచి రావాల్సిన రూ.6,600 కోట్ల సీఎస్టీ బకాయిలను విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు. ఎంపీ వినోద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న స్మార్ట్ సిటీల్లో రాష్ట్రంలో రెండు పట్టణాలను గుర్తించనున్నట్టు వార్తలు వస్తున్నాయని, అయితే ఐదు పట్టణాలను స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులను కోరినట్టు చెప్పారు. పట్టణాభివృద్ధిశాఖ అధికారులను రాష్ట్రంలో పర్యటించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఆహ్వానించినట్టు తెలిపారు. -
నేడు సీఎం కేసీఆర్ రాక
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని లింగవారివారిగూడెంలో ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తల్లి కమలమ్మ దశదినకర్మ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. కార్యక్రమంలో సీఎంతోపాటు రాష్ట్రమంత్రులు ఈటెల రాజేందర్, హరీష్‌రావు, గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా పాల్గొంటారు. -
బడ్జెట్లో మాకూ చోటివ్వండి!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి నిధులను కేటాయించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న కోరారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1.25 లక్షల మంది ఉన్న భవన కార్మికులు సొంత గూడు లేక గుడిసెల్లో, అద్దె ఇళ్లలో నివాసముంటున్నారని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులందరికీ 120 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. అనారోగ్య సమస్యలు, ప్రమాదవశాత్తు ఎంతో మంది కార్మికులు మరణిస్తున్నారని అందుకే వారి ఆరోగ్యరీత్యా ఆరోగ్య కార్డులు కేటాయించాలని కోరారు. -
తెలంగాణ వచ్చిందన్న సంతోషమే లేదు
ప్రకృతి సహకరించకే ఈ కష్టాలు కరెంటును కొనుగోలు చేస్తే రాదు టీడీపీ శవరాజకీయాలు తగవు ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్: వర్షాభావం.. కరెంటు కొరతతో తెలంగాణ సాధించుకున్న సంతోషం కనిపిం చడం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఈ కష్టాలకు ప్రకృతి సహకరించకపోవడమే కారణమన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని కేసీ క్యాంపులో 220 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ల్లోనే కాకుండా ఈసారి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నూ కరువు నెలకొందని ఆవేదన చెందారు. దీనిని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు రాజకీ యం చేస్తున్నారని మండిపడ్డారు. శవరాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. కరెంటు కొంటే వస్తుందా..? కరెంటును కొనుగోలు చేయాలని అర్థం లేకుండా విమర్శలు చేయడం అనాలోచితమని ఈటెల అన్నారు. కొనుగోలు చేసినంత మాత్రాన అక్కడి నుంచి ఇక్కడకు లైన్లు ఉండొద్దా? అని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులు ఆ లైన్లన్నీ వారివైపే వేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు 6,700 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, 4వేల పైచిలుకు మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉందన్నారు. డిసెంబర్లో శంకుస్థాపన కరీంనగర్ జిల్లా రామగుండంలో 1,300 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు డిసెంబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కూడా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈటెల సభపై తేనెటీగల దాడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శివారు కేసీ క్యాంపులో మంగళవారం మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్న ఓ సభపై తేనెటీగలు దాడి చేశాయి. ఇక్కడ మంత్రి 220 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. అనంత రం మంత్రి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా ఈటెల, కలెక్టర్ వీరబ్రహ్మయ్యను చుట్టుముట్టాయి. పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది టవల్స్ తెచ్చి వారిపై రక్షణగా కప్పారు. పావుగంట అనంతరం మళ్లీ సభను కొనసాగించారు. -
నెలాఖరులో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: రాష్ర్ట బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు కసరత్తును దాదాపు పూర్తి చేశారు. బడ్జెట్ సమావేశాల కోసం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సోమవారం సాయంత్రం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుమారు రూ. 80 వే ల కోట్ల మేరకు బడ్జెట్ ఉంటుందని అంచనా. జూన్ 2 నుంచే బడ్జెట్ ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే జూన్ నుంచి అక్టోబర్ వరకు అయిన ఖర్చుతోపాటు నవంబర్ నుంచి మార్చి వరకు చేయాల్సిన వ్యయానికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం పొందనుంది. సమావేశాలు 20 రోజులు జరిగే అవకాశమున్నట్లు సమాచారం. -
పల్లెలు, పట్టణాలనూ అభివృద్ధి చేయాలి
‘అర్బన్ ఫైనాన్స్’ వర్క్‌షాప్‌లో మంత్రి ఈటెల హైదరాబాద్: నగరాలతోపాటు పల్లెలు, పట్టణాలను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో త్వరలో జరుగనున్న మెట్రో పొలిస్ సదస్సు సన్నాహకాల్లో భాగంగా సోమవారం ఇక్కడి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో ‘అర్బన్ ఫైనాన్స్’ అంశంపై జరిగిన ప్రీ-కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌లో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగరాలు, పల్లెలు రెంటికీ ప్రాధాన్యమిస్తూ మానవీయ కోణంలో చేపట్టే చర్యలపై మెట్రోపొలిస్ సదస్సులో ఫోకస్ చేయాలని కోరారు. అభివృద్ధి కంటే భద్రత, ఉపాధి కల్పన తదితర అంశాలు కూడా ముఖ్యమేనన్నారు. నగరీకరణ అనివార్యంగా పెరుగుతోందని, నగర వాసుల జీవితం యాంత్రికంగా మారి మానవ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు, నిబంధనలు వ్యక్తులు, హోదాలను బట్టి కాకుండా అందరికీ ఒకేవిధంగా పక డ్బందీగా అమలు కావాలని అభిలషించారు. ప్రభుత్వాలు మారినా శాస్త్రీయంగా చేపట్టిన పథకాలు మారరాదని సూచించారు. మన్నికే ప్రధానం: తాగునీటి లైన్లు, డ్రెయినేజీల ఏర్పాటు వంటి ఏపనికైనా నాణ్యత పాటించకుంటే ఎన్ని నిధులు వెచ్చించినా నిష్ర్పయోజనమేనని మంత్రి తెలిపారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు, ఫుట్‌పాత్‌లను ఇందుకు ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు. ప్రజలు నగరాల వైపు ఉపాధి కోసం చూసే ధోరణి మారాలంటే పల్లెలు, పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలని అన్నారు. మెట్రోపొలిస్ సదస్సు నిర్వహించే అవకాశం ఆసియా దేశాల్లో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడం గర్వకారణమన్నారు. సదస్సు కోసం ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా పనులు చేస్తున్నాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె.మహంతి, సీజీజీ డెరైక్టర్ జనరల్ కె. రామకృష్ణారావు, అడిషనల్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ గంగయ్య, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ అహ్మద్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ‘రేషన్’పై నేడు కేబినెట్ సబ్‌కమిటీ భేటీ అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమై సీఎంకు నివేదిక అందజేస్తుందన్నారు. ప్రస్తుతం రూపా యికి కిలో చొప్పున కుటుంబానికి ఇస్తున్న 30 కిలోల బియ్యాన్ని 35 కిలోలకు పెంచే విషయం పరిశీలనలో ఉందన్నారు. సాధ్యాసాధ్యాలు బేరీజు వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు
ములుగు: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ములుగు మండలం నర్సాపూర్ మీదుగా సికింద్రాబాద్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును బుధవారం మంత్రి ఈటెల, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందూ ప్రజలకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తప్పకుండా నెరవేరుస్తారన్నారు. దసరా పండుగ నుంచి సీఎం కొత్త పథకాలకు శ్రీకారం చుడతారన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సీఎం, మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జెడ్పీటీసీ సత్తయ్య, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూంరెడ్డి, మున్సిపల్ చెర్మైన్ భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, సర్పంచ్ మల్లేష్‌యాదవ్, సహకార సంఘం చెర్మైన్ పోషిరెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షులు జహంగీర్, ఉపాధ్యక్షుడు అర్జున్‌గౌడ్, అయిలయ్య, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాస్ శ్రీనివాస్,నాయకులు దేవేందర్‌రెడ్డి, బాపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, గణేష్, భూపాల్‌రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు. -
హౌసింగ్‌లో రూ.50 కోట్ల కుంభకోణం
కరీంనగర్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం మండలాల్లో గృహనిర్మాణ పథకంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి జెడ్పీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొప్పాపూర్‌లో 600 రేషన్‌కార్డులుంటే, 750 ఇండ్లు మంజూరయ్యాయంటూ అవినీతికి ఆధారాలను బయటపెట్టారు. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా హౌసింగ్, పింఛన్లలో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. బ్రోకర్లు, పైరవీదారుల కోసం తమ ప్రభుత్వం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం పోయిందని, ఆ నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేందుకే ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. జిల్లాలోని ప్రాధాన్యతా అంశాలను ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రా అధికారి వెళ్లిపోవాలి : బొడిగె శోభ ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తన సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అల్టిమేటం జారీ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు మంజూరైనా, అధికారులు పనులు చేపట్టడం లేదన్నారు. పనులు చేయకపోవడానికి ఈఈ లేడని ఎస్ఈ సాకు చూపిస్తున్నాడన్నారు. ఆంధ్రాకు చెందిన ఆ అధికారికి తెలంగాణలో పనిచేయడం ఇష్టం లేకపోతే సొంత ప్రాంతానికి వెళ్లొచ్చన్నారు. -
ఆశీస్సులు ఎవరికో?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ దళపతి కేసీఆర్ గుంభనంగా ఉన్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన జడ్పీ పీఠంపై కలలుగంటున్న జడ్పీటీసీ సభ్యులు ఎవరికీ వారే ప్రయత్నాలు చేస్తుండగా.. అధినేత అంతరంగం మాత్రం బయట పడటం లేదు. జిల్లాలో నలుగురు జడ్పీటీసీ సభ్యులు జడ్పీ చైర్మన్ రేసు లో ఉండగా.. నలుగురు ఎమ్మెల్యేలు సై తం తమ అనుచరులకు పదవి కట్టబెట్టేం దుకు సిఫారసు చేస్తున్నారు. సార్వత్రిక ఎ న్నికల ఫలితాలకు ముందే.. 24 మంది జడ్పీటీసీలను ఈ నెల 14న క్యాంపునకు తరలించిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ము ఖ్య నాయకులు, జడ్పీటీసీ సభ్యులతో మా ట్లాడిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్.. జడ్పీ చైర్మన్ అభ్యర్థి విషయం లో తుది నిర్ణయం కేసీఆర్‌దేనని ప్రకటించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా క్యాంపును విరమించిన జడ్పీటీసీ సభ్యులు జిల్లాకు చేరుకున్నారు. అప్పటి నుంచి జడ్పీ చైర్మన్ ఎవరనేది ప్రకటించక పోవడం చర్చనీయాంశం అవుతోంది. రేసులో నలుగురు .. జిల్లాలోని 36 మండలాల్లో 24 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీకే ఆ పీఠం దక్కనుండగా... ఆ పార్టీకి చెందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నారు. అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఈసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి హవా కొనసాగింది. టీఆర్ఎస్ మూడోసారి ఇందూరు జడ్పీపై గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమైంది. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మూడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డిల నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. గాంధారి మండల జడ్పీటీసీ హరాలే తానాజీరావు, కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు, నిజాంసాగర్ల నుంచి ఎన్నికైన నంద రమేశ్, డి.రాజులు జడ్పీ పీఠంపై కన్నేశారు. ఈ మేరకు ఆ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు సైతం తమ తమ అనుచరులకు జడ్పీ పీఠం దక్కేలా ఎవరికి వారు అధినేతకు సిఫారసు కూడ చేసినట్లు సమాచారం. ప్రమాణ స్వీకారం తర్వాతే.. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ నేతలు, క్యాడర్‌ను సమన్వయం చేయడంలో సఫలీకృతులైనట్లు అధిష్టానం భావిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు రావడమే ఇందుకు నిదర్శమని అంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడగా.. జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికీ దక్కుతాయనే చర్చ కూడా జరుగుతోంది. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముం దు జడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించిన పార్టీ.. ఫలితాల తర్వాత గుంభనంగా ఉంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగనుండటంతో పాటు.. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుం దని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్పీ ైచె ర్మన్ కోసం నలుగురు ఎమ్మెల్యేలు నలుగురి పేర్లు సూచిస్తున్పప్పటికీ అధినేత ఆశీస్సులు ఎవరికీ దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది.