సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ దళపతి కేసీఆర్ గుంభనంగా ఉన్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన జడ్పీ పీఠంపై కలలుగంటున్న జడ్పీటీసీ సభ్యులు ఎవరికీ వారే ప్రయత్నాలు చేస్తుండగా.. అధినేత అంతరంగం మాత్రం బయట పడటం లేదు. జిల్లాలో నలుగురు జడ్పీటీసీ సభ్యులు జడ్పీ చైర్మన్ రేసు లో ఉండగా.. నలుగురు ఎమ్మెల్యేలు సై తం తమ అనుచరులకు పదవి కట్టబెట్టేం దుకు సిఫారసు చేస్తున్నారు. సార్వత్రిక ఎ న్నికల ఫలితాలకు ముందే.. 24 మంది జడ్పీటీసీలను ఈ నెల 14న క్యాంపునకు తరలించిన పార్టీ అధిష్టానం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో సమావేశం ఏర్పాటు చేసింది.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ము ఖ్య నాయకులు, జడ్పీటీసీ సభ్యులతో మా ట్లాడిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్.. జడ్పీ చైర్మన్ అభ్యర్థి విషయం లో తుది నిర్ణయం కేసీఆర్‌దేనని ప్రకటించినట్లు సమాచారం. ఆ మరుసటి రోజే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా క్యాంపును విరమించిన జడ్పీటీసీ సభ్యులు జిల్లాకు చేరుకున్నారు. అప్పటి నుంచి జడ్పీ చైర్మన్ ఎవరనేది ప్రకటించక పోవడం చర్చనీయాంశం అవుతోంది.
రేసులో నలుగురు ..
జిల్లాలోని 36 మండలాల్లో 24 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ పార్టీకే ఆ పీఠం దక్కనుండగా... ఆ పార్టీకి చెందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నారు. అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఈసారి జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి హవా కొనసాగింది. టీఆర్‌ఎస్ మూడోసారి ఇందూరు జడ్పీపై గులాబీ జెండా ఎగుర వేయడం ఖాయమైంది. జడ్పీటీసీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తం స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆ మూడు నియోజకవర్గాలతో పాటు కామారెడ్డిల నుంచి ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు చైర్మన్‌గిరి కోసం పోటీ పడుతున్నారు. గాంధారి మండల జడ్పీటీసీ హరాలే తానాజీరావు, కోటగిరి జడ్పీటీసీ పుప్పాల శంకర్, భిక్కనూరు, నిజాంసాగర్‌ల నుంచి ఎన్నికైన నంద రమేశ్, డి.రాజులు జడ్పీ పీఠంపై కన్నేశారు. ఈ మేరకు ఆ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు సైతం తమ తమ అనుచరులకు జడ్పీ పీఠం దక్కేలా ఎవరికి వారు అధినేతకు సిఫారసు కూడ చేసినట్లు సమాచారం.
ప్రమాణ స్వీకారం తర్వాతే..
రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ నేతలు, క్యాడర్‌ను సమన్వయం చేయడంలో సఫలీకృతులైనట్లు అధిష్టానం భావిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు రావడమే ఇందుకు నిదర్శమని అంటున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడగా.. జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎంపిక కీలకంగా మారింది. ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఎవరికీ దక్కుతాయనే చర్చ కూడా జరుగుతోంది.
అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముం దు జడ్పీటీసీ సభ్యులను క్యాంపునకు తరలించిన పార్టీ.. ఫలితాల తర్వాత గుంభనంగా ఉంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగనుండటంతో పాటు.. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే జిల్లా పరిషత్ అధ్యక్షుని ఎన్నిక జరుగుతుం దని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్పీ ైచె ర్మన్ కోసం నలుగురు ఎమ్మెల్యేలు నలుగురి పేర్లు సూచిస్తున్పప్పటికీ అధినేత ఆశీస్సులు ఎవరికీ దక్కుతాయనేది చర్చనీయాంశంగా మారింది.
ఆశీస్సులు ఎవరికో?
Published Wed, May 28 2014 1:28 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement