ములుగు: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ములుగు మండలం నర్సాపూర్ మీదుగా సికింద్రాబాద్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సును బుధవారం మంత్రి ఈటెల, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు.
కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందూ ప్రజలకిచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తప్పకుండా నెరవేరుస్తారన్నారు. దసరా పండుగ నుంచి సీఎం కొత్త పథకాలకు శ్రీకారం చుడతారన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సీఎం, మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ‘గడా’ ప్రత్యేకాధికారి హన్మంతరావు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జెడ్పీటీసీ సత్తయ్య, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూంరెడ్డి, మున్సిపల్ చెర్మైన్ భాస్కర్, రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, సర్పంచ్ మల్లేష్‌యాదవ్, సహకార సంఘం చెర్మైన్ పోషిరెడ్డి, టీఆర్‌ఎస్ అధ్యక్షులు జహంగీర్, ఉపాధ్యక్షుడు అర్జున్‌గౌడ్, అయిలయ్య, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాస్ శ్రీనివాస్,నాయకులు దేవేందర్‌రెడ్డి, బాపురెడ్డి, భాస్కర్‌రెడ్డి, గణేష్, భూపాల్‌రెడ్డి, కాంతారెడ్డి పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు
Published Thu, Sep 25 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement