న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు విడుదల చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. ఈ కమిటీలో ఆయనతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు సీనియర్ నేతలకు అవకాశం దక్కింది.
వీరితో పాటు గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్టానంపై ముభావంగా ఉంటోన్న ఆనంద్ శర్మ, శశిథరూర్, సచిన్ పైలట్ సహా పలువురు జీ-23 నేతలకు కూడా వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే 39 మంది సభ్యులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరిలో 32 మందిని శాశ్వత సభ్యులుగా ప్రకటించగా 13 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.
ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఏపీ నుంచి రఘువీరా రెడ్డికి చోటు కల్పించగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామి రెడ్డిని శాశ్వత ఆహ్వానితుడిగా ఖర్గే ప్రకటించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు , చల్లా వంశీచందర్ రెడ్డి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ , ఉత్తం వర్గాలను నిరాశపరిచింది.
ఇది కూడా చదవండి: నాన్నా.. మీ బాటలోనే నేను: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment